దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షపాతం తగ్గుతోంది. దేశంలోరి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది. ఎండ వేడిమికి జనం అలవాటు అయిపోయారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు నిత్యం ఎండలోనే ఉండాల్సి వస్తోంది. దేశంలోని ఈ ప్రాంతంలోని పోలీసులుకు ఎండ నుంచి విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ పోలీసులకు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం నివారించడానికి కొత్త మార్గాన్ని అనుసరించారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో ఉండే పోలీసులకు ఏసీ హెల్మెట్ లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే మొదటిసారి పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు వడోదర ట్రాఫిక్ పోలీసులు సరైన పరిష్కారాన్ని కనిపెట్టారు.

ఇక్కడ పోలీసు శాఖ ఇప్పుడు తన సిబ్బందికి ఏసీతో కూడిన ప్రత్యేక హెల్మెట్‌లను అందజేస్తోంది. ఈ కొత్త ఏసీ హెల్మెట్‌లు 40-42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో కూడా తమను తాము చల్లబరుచుకోవడానికి ఏసీ హెల్మెట్లు ఉపయోగపడుతాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ హెల్మెట్‌లను వివిధ ప్రత్యేకతలతో తయారు చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి కళ్లు, తలను కాపాడుకునేందుకు పోలీసులకు ఈ హెల్మెట్లు దోహదపడుతుంది.
ఈ హెల్మెట్ కు ఛార్జింగ్ పాయింట్ కూడా కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌తో ఈ హెల్మెట్‌లు పోలీసులకు నాన్ స్టాప్ గా సుమారు ఎనిమిది గంటల వరకు చల్లగా ఉంచగలదని అధికారులు అంటున్నారు. మండుతున్న ఎండలకు ఆయాసంతో పోలీసు అధికారులు రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన సంఘటనలు ఇప్పటికే అనేకసార్లు వెలుగు చూశాయి. అందువల్ల భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఏసీ హెల్మెట్‌లను సిద్ధం చేసి ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్‌లు ధరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఏసీ హెల్మెట్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.












Click it and Unblock the Notifications