భారీ పేలుడు.. 17 మంది మృతి

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్ లోని బనస్ కాంత జిల్లాలోని దీపా పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకొని ఉండొచ్చని సమాచారం.

దీపా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు సంభవించినట్లు స్థానిక ఎస్సై విజయ్ చౌదరీ తెలిపారు. పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్ర భవనం కుప్పకూలినట్లు వివరించారు. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృతి చెందారని.. మరికొంత మందికి తీవ్ర గాయలైనట్లు పేర్కొన్నారు.

Tragic Blast at Gujarat Fireworks Factory Kills 17 Workers

క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+