శుభవార్త: ఇంటర్ కనెక్షన్ చార్జీలు 6పైసలకు తగ్గింపు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఇంటర్ కనెక్షన్ చార్జీలను (ఐయూసీ)లను నిమిషానికి 14పైసల నుండి 6 పైసలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

తగ్గించిన ఈ ఛార్జీలు అర్టోబర్ 1వ, తేది , 2017 అమలులోకి వస్తాయని ట్రాయ్ ప్రకటించింది . ఇంటర్ కనెక్షన్ ఛార్జీలను తగ్గించాలని భారత టెలికాం రంగ సంస్థ( ట్రాయ్)ను రిలయన్స్ జియో చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది.
దీనిపై ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్న ట్రాయ్ ఈ ప్రకటన చేసింది. అంతేగాక, జనవరి 1, 2020 నుంచి ఈ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపింది. దీంతో వినియోగదారులకు మొబైల్ కాల్ ధరలు తగ్గనున్నాయి.












Click it and Unblock the Notifications