వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్జరీ పనులు చేస్తే నా తడాఖా చూపిస్తా: సీఎంకు దినకరన్ వార్నింగ్, ఎమ్మెల్యేలు జంప్ !

ప్రజలకు సేవ చెయ్యకుండా పదవీవ్యామోహంతో స్వార్థం కోసం అన్నాడీఎంకే పార్టీని కబళించే ప్రయత్నాల కోసం ఫోర్జరీ పనులు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, తగిన బుద్ది చెబుతానని తమిళనాడు ముఖ్యమంత్రి .

|
Google Oneindia TeluguNews

మదురై: ప్రజలకు సేవ చెయ్యకుండా పదవీవ్యామోహంతో స్వార్థం కోసం అన్నాడీఎంకే పార్టీని కబళించే ప్రయత్నాల కోసం ఫోర్జరీ పనులు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, తగిన బుద్ది చెబుతానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గాన్ని శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ హెచ్చరించారు.

నా సత్తా ఏంటో చూపిస్తా, సీఎంకు చాలెంజ్, మన్నార్ గుడి మాఫియా కథ తేలిపోతుంది !నా సత్తా ఏంటో చూపిస్తా, సీఎంకు చాలెంజ్, మన్నార్ గుడి మాఫియా కథ తేలిపోతుంది !

మదురై సమీపంలోని మేలూరులో సోమవారం రాత్రి దినకరన్ వర్గీయులు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీటీవీ దినకరన్ ఉద్వేగంగా ప్రసగించారు.

TTV Dinakaran confident party will get back Two Leaves symbol

అన్నాడీఎంకేలోని చీలక వర్గాలను ఒక్కటి చేసి రెండాకుల చిహ్నం సంపాధించి పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చే బాధ్యత తన మీద ఉందని దినకరన్ అన్నారు. జయలలిత మరణించిన రోజు శశికళ అనుకుని ఉంటే కచ్చితంగా అదే రోజు సీఎం అయ్యేవారని టీటీవీ దినకరన్ చెప్పారు.

త్యాగశీలి అయిన శశికళ ఆరోజు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేశారని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు. శశికళ జైలుకు వెలుతూ పార్టీని కంటికి రెప్పలా కాపాడాలని తన దగ్గర మాట తీసుకుని వెళ్లారని, అయితే నన్నే కొందరు పార్టీకి దూరం చెయ్యాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని పరోక్షంగా ఎడప్పాడి పళనిసామి వర్గాన్ని విమర్శించారు.

ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం భేటీ, విలీనంపై చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం !ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం భేటీ, విలీనంపై చర్చ, కీలక ప్రకటన చేసే అవకాశం !

తాను తలుచుకుంటే తన సత్తా చూపిస్తానని, అయితే జయలలిత అధికారంలోకి తీసుకు వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తాను కూల్చనని దినకరన్ చెప్పారు. దినకరన్ బహిరంగ సభకు అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు హాజరైనారు.

అయితే సోమవారం ఉదయం వరకు దినకరన్ వెంట 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు చిన్నగా జారుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ ఇలాగే దినకరన్ గ్రూప్ నుంచి చిన్నగా జారుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Continuing to put up a brave front despite a revolt by Chief Minister K Palaniswami-led camp, beleaguered ruling AIADMK (Amma) deputy chief TTV Dhinakaran on Monday exuded confidence of uniting the party and getting back its Two Leaves symbol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X