జయలలితను అవమానిస్తావా: మంత్రులు అందరూ అమ్మ ఆశీర్వాదంతోనే, ప్రజలు చేతిలో !
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారణం, ఇప్పుడు ఉన్న మంత్రలు అందరూ అమ్మ జయలలిత నియమించిన వారే అంటూ ఆరాష్ట్ర మంత్రి జయకుమార్ మన్నార్ గుడి మాఫియాకు.
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారణం, ఇప్పుడు ఉన్న మంత్రలు అందరూ అమ్మ జయలలిత నియమించిన వారే అంటూ ఆరాష్ట్ర మంత్రి జయకుమార్ మన్నార్ గుడి మాఫియాకు గుర్తు చేశారు.
అమ్మ ఏర్పాటు చేసిన మంత్రి వర్గాన్ని విమర్శిస్తే జయలలితను విమర్శించినట్లే అంటూ టీటీవీ దినకరన్ కు గట్టి షాక్ ఇచ్చారు. నువ్వా అమ్మ ఆశయాలను కాపాడేది అని టీటీవీ దినకరన్ ను మంత్రి జయకుమార్ ప్రశ్నించారు. సిగ్గు లేకుండా అమ్మ పేరు చెప్పుకుని తిరుగుతున్నారని మంత్రి జయకుమార్ మండిపడ్డారు.

జయలలిత ఆసుపత్రిలో ఉన్న సయయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు ? ఏం చేశారు ? అనే పూర్తి వివరాలు విచారణ కమిషన్ దర్యాప్తులో బయటకు వస్తాయని మంత్రి జయకుమార్ అన్నారు. ఇంకో సారి అమ్మ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే మిమ్మల్ని తరిమితరిమి కొడతారని జయకుమార్ మన్నార్ గుడి మాఫియాను హెచ్చరించారు.
ఇటీవల టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో చేతకాని ప్రభుత్వం ఉందని, వారందరినీ ఇంటికి పంపిస్తామని విమర్శించడంతో మంత్రి జయకుమార్ అతనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీటీవీ దినకరన్ వెనుక ఉంటే ఏంజరుగుతుందో ప్రజలందరికీ తెలుసని మంత్రి జయకుమార్ వివరించారు.












Click it and Unblock the Notifications