బెంగళూరు ట్విట్టర్ ఉద్యోగులకు పింక్ స్లిప్ !

బెంగళూరు: ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ భారత్ లో ఇంజనీరింగ్ కలాపాలు తగ్గించడానికి ప్లాన్ వేస్తున్నదని వెలుగు చూసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ట్విట్టర్ డెవలప్ మెంట్ సెంటర్ లో ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.

అయితే బెంగళూరులో ఉన్న ట్విట్టర్ డెవలప్ మెంట్ సెంటర్ లో ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తాము అని స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. సాధారణ వ్యాపార సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్ తెలిపింది.

 Twitter to lay employees at Bengaluru Development Center

బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ లోని గ్లోబల్ ఇంజనీరింగ్ వర్క్ ను నిలిపివేయాలని నిర్ణయించామని ట్విట్టర్ ఈమెయిల్ సమాధానంలో తెలిపింది. ఉద్యోగులను కంపెనీ నుంచి గౌరవంగా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్విట్టర్ వెల్లడించింది.

ట్విట్టర్ మార్కెట్ భారత్ లో అత్యంత వేగవంతంగా పెరుగుతున్నది. ఇక్కడ తమ వినియోగదారులను పెంచుకోవడానికి కీలకరంగాల్లో పెట్టుబడులు పెడుతామని ట్విట్టర్ స్పష్టం చేసింది.

2015లో ట్విట్టర్ బెంగళూరులోని మొబైల్ మార్కెటింగ్ అండ్ అనలిస్ట్ కంపెనీ జిప్ డయల్ మొబైల్ సొల్యూషన్స్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా వెబ్ సైట్లతో ట్విట్టర్ గట్టి పోటీ ఎదుర్కోంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+