సోదరిని ప్రేమించాడని యువకుడి అంగాన్ని కోసేశారు

వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్న కాలంగా బాధితుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి కూడా ఇతన్ని ఇష్టపడుతోంది. అయితే ఈ విషయం తెలిసిన యువతి సోదరులు ఇద్దరు ఆ యువకునిపై కోపం పెంచుకున్నారు. దొరికితే తాటతీస్తామనుకుంటున్న సమయంలోనే ఆ యువకుడి వారింటికి వచ్చాడు.
దీంతో ఆగ్రహంతో ఉన్న యువతి సోదరులిద్దరూ అతన్ని కుర్చీలో తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత అతని అంగాన్ని కత్తితో కోసేశారు. తీవ్ర రక్తం స్రావం కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రేమించిన యువతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం బాధిత యువకుడ్ని పాట్నాలోని ఆస్పత్రికి తరలించారు.
కాన్పు కోసం వస్తే.. బయటికి గెంటేశారు
వరంగల్/గుంటూరు: కాన్పు కోసం వచ్చిన గర్భవతులను ఆస్పత్రిలోని రానీయకపోవడంతో వారు తీవ్ర నరకయాతన అనుభవించారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని జనగామ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. కాన్పు కోసం ముగ్గురు మహిళలు శనివారం జనగామ ఆస్పత్రికి వచ్చారు. కాన్పు చేసేందుకు వారికి వైద్య సిబ్బంది మత్తు ఇచ్చారు.
అయితే తమ డ్యూటీ టైం అయిపోయిందని వైద్యులు, సిబ్బంది కాన్పు కోసం వచ్చిన ముగ్గురు మహిళలను బయటకు గెంటేశారు. దీంతో వారు తీవ్ర నరకయాతన అనుభవించారు. వారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
ఇది ఇలా ఉండగా మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు. ఈ గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తికి, తాడేపల్లికి చెందిన మహాలక్ష్మితో 2006లో వివాహమైంది. వారిద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పని చేసిన డబ్బులన్నీ శ్రీనివారావు మద్యం సేవించడానికే ఖర్చు పెట్టేవాడు. దీంతో లక్ష్మి అతనితో తరచూ గొడవపడేది. కొడుకు పుట్టాక లక్ష్మిని వదిలేసి మరో యువతిని శ్రీనివాసరావు పెళ్లి చేసుకున్నాడు. దీంతో లక్ష్మి తన పుట్టింటికి వచ్చేసింది. మే 7న ఇక్కడికి వచ్చిన శ్రీనివాసరావు తన కొడుకుకు చాక్లెట్ ఇస్తానని చెప్పి అతన్ని కిడ్నాప్ చేశాడు. దీంతో లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications