దారుణం: బంధువులే ఇద్దరు మహిళలకు మలం తినిపించారు
రాంచీ: జార్ఖండ్‌లో చేతబడి చేస్తున్నారనే నెపంతో బంధువులే తల్లి, కూతురితో బలవంతంగా అశుద్దాన్ని(మలాన్ని) తినిపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
గత బుధవారం ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. సోనాహుత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జార్ఖండ్ కు చెందిన 65 ఏళ్ల కరో ఆమె కూతురు బసంతి దేవి(35)లను దగ్గరి బంధువులే ఇంటి నుంచి లాక్కొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతేగాకుండా కొట్టుకుంటూ ఊరి చివరి చెరువు వరకు తీసుకెళ్లారు.

ఓ భూతవైద్యుడు చెప్పిన మాటల కారణంగానే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.. బాధిత కుటంబ సభ్యుల్లో ఓ మహిళ మరణించిందని, మరో ఇద్దరు అనారోగ్యానికి గురవడంతో మిసిరియా పురాణ్ అనే భూత వైద్యుడిని సంప్రదించారు.
భూత వైద్యుడి చెప్పిన మాటల కారణంగా ఇద్దరు మహిళలపై వారి సమీప బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారు.భూత వైద్యుడితో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మంత్రగాళ్లు చెప్పె మూడ నమ్మకాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications