ఆ రాష్ట్రంలో అందరికీ ఒకే చట్టం

UCC Bill 2024: అత్యంత వివాదాస్పదంగా భావించే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ఊపిరి పోసుకుంది. చట్ట రూపాన్ని దాల్చింది. మనుగడలోకి వచ్చింది. ఈ బిల్లును కొద్దిసేపటి కిందటే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. దీనితో- ఆ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్టయింది. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన మొట్ట మొదటి రాష్ట్రంగా ఆవిర్భవించింది ఉత్తరాఖండ్.

యూసీసీ చట్టంగా మారిన నేపథ్యంలో- ఇకపై అక్కడ నివసించే ప్రతి పౌరుడికీ సమాన చట్టం వర్తిస్తుంది. తమ మత విశ్వాసాలకు అతీతంగా ఒకే చట్టాన్ని ప్రజలు అనుసరించాల్సి ఉంటుంది. పెళ్లిళ్ల వంటి శుభాకార్యాలను జరుపుకోవడం, విడాకులు మంజూరు చేయడం వంటివి ఈ సివిల్ కోడ్ యాక్ట్ నిబంధనలకు లోబడే ఉంటాయి.

UCC Bill 2024 has passed in the Uttarakhand Assembly

భూముల కొనుగోళ్లు, స్థిర- చరాస్తుల విషయంలో మతాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల మేరకే వాటి క్రయ విక్రయాలు గానీ, ఇతర లావాదేవీలు గానీ ఆధారపడి ఉంటాయి. ఈ ఉదయం యూసీసీ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. సభలో ప్రవేశపెట్టారు.

దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ బిల్లు వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి సభకు వివరించారు. మతం అనే తేడాను చెరిపేయడంలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని అన్నారు. దీన్ని ఆమోదించడానికి ప్రతిపక్షం అంగీకరించలేదు. ఇందులో అనేక లోపాలు ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ పట్టుబట్టారు.

ఈ డిమాండ్ పట్ల పుష్కర్ సింగ్ ధామి సానుకూలంగా స్పందించలేదు. అన్ని కోణాల నుంచి ఆలోచించామని, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తరువాతే బిల్లును రూపొందించామని వివరించారు. ఇలాంటి బిల్లును తప్పనిసరిగా రాష్ట్రంలో అమలు పర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు.

యూసీసీ ముసాయిదాను రూపొందించడానికి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోహ్లీ, సామాజిక కార్యకర్త మను గౌర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శతృఘ్న సింగ్, డూన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురేఖ దంగ్వాల్ ఉన్నారు. వారు రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్రమంత్రి వర్గం ఆమోదించింది. అనంతరం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చి.. ఆమోదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+