ఇలా చేస్తే ఎలా: మోడీపై ఉద్దవ్ థాకరే నిప్పులు
ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాకరే నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన తన పత్రిక సామ్నాలో ప్రధానిపై మండిపడ్డారు.
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాకరే నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన తన పత్రిక సామ్నాలో ప్రధానిపై మండిపడ్డారు.
అచ్చేదిన్ వాణిజ్య ప్రకటనలలో మాత్రమే కనిపిస్తోందని, అన్ని వ్యవహారాలు ప్రధాని ఇష్టానుసారం సాగితే ఇక మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టా అని ప్రశ్నించారు.

అధికారాలన్నింటిని విభజించడానికి బదులు కేంద్రం వద్ద కేంద్రీకృతం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల స్వతంత్రాన్ని హరిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications