కరోనా: మహారాష్ట్ర సీఎం సిబ్బంది క్వారంటైన్, 170 మంది నిర్భందం, ఏం జరిగిందంటే..?
కరోనా వైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. వ్యక్తులకు స్థాయి ఉంటుందేమో గానీ.. వైరస్‌కు మాత్రం తరతమ బేధాలు ఏం లేవు. మహారాష్ట్ సీఎం ఉద్దవ్ థాకరే సెక్యూరిటీ సిబ్బంది కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. వాస్తవానికి సెక్యూరిటీ సిబ్బంది, కుటుంబసభ్యులకు వైరస్ సోకలేదు. విదేశాలకు వెళ్లిరాలేదు. టీ విక్రయించే వ్యక్తికి వైరస్ సోకింది. అతని టీ పాయింట్ వద్దకు సెక్యూరిటీ సిబ్బంది వచ్చేవారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో పెట్టడం చర్చకు దారితీసింది.

టీ విక్రేతకు వైరస్..
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే.. ప్రైవేట్ నివాసం కళానగర్‌లో మాతో శ్రీ పేరుతో ఉంది. ఉద్దవ్ థాకరే ఎక్కువగా గడుపుతారు. దీంతో సెక్యూరిటీ కూడా మొహరిస్తారు. అయితే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మాతో శ్రీ సమీపంలో ఓ టీ స్టాల్ ఉంది. అతని వద్దకు ఎప్పుడూ జనాలు వచ్చేవారు. అయితే ఇటీవల అతనికి కూడా కరోనా వైరస్ సోకింది.

పాజిటివ్..
జ్వరం తగ్గకపోవడం, దగ్గు, శ్వాస తీసుకోవడంతో ముంబైలోని ఆస్పత్రిలో చేరాడు. అతనికి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. అయితే అంతకుముందు సీఎం ఉద్దవ్ థాకరే భద్రతా సిబ్బంది అతని టీ స్టాల్‌కి వెళ్లేవారు. దీంతో తమకు కూడా వైరస్ సోకిందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. సీఎం సెక్యూరిటీగా ఉన్న పోలీసులు, సిబ్బంది 170 మంది బాంద్రా ఈస్ట్‌లో గల ఉత్తర భారతీయ సంఘ్ భవనంలో నిర్భందంలో ఉన్నారు.

స్ప్రే..
ఉద్దవ్ థాకరే నివాస ప్రాంతం సమీపం కరోనా పాజిటివ్ అని తేలడంతో కరోనా నియంత్రణ జోన్‌గా ప్రకటించారు. సీఎం నివసించే చుట్టుపక్కల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్ప్రే చేయించారు. మరోవైపు ముంబైలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఉద్దవ్ థాకరే తన సిబ్బందితో దూరంగా ఉంటున్నారు. కారును కూడా స్వయంగా డ్రైవింగ్ చేస్తూ.. పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వెనకాల భద్రతా సిబ్బంది అనుసరించేవారు. ఇటీవల ముఖ్యమంత్రిని ఎవరూ కలిశారనే వివరాలను కూడా సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

వివరాల సేకరణ..
మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరే కూడా మాతోశ్రీలో ఉంటున్నారు. ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే అనే విషయం తెలిసిందే. అయితే అతని భద్రతా సిబ్బంది, అధికారులు కూడా.. టీ విక్రయించే వారితో సన్నిహితంగా మెలిగారా అనే అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఒకవేళ అలా దగ్గరగా ఉంటే వారిని కూడా క్వారంటైన్‌లోకి తరలిస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications