భక్తులకు కేంద్రం వరాలు- నడవాల్సిన పని లేదు..
Kedarnath: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- కేదార్‌నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. ఈ క్రమంలో ఎన్నో ప్రయాసలను ఎదుర్కొంటుంటారు. ఈ యాత్రను సులభతరం చేసింది కేంద్ర ప్రభుత్వం.
సోన్‌ప్రయాగ నుండి కేదార్‌నాథ్ వరకు రోప్ వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ వరకు 12.9 కిలో మీటర్ల పొడవున ఈ రోప్‌వే ప్రాజెక్టును నిర్మించడానికి అంగీకారం తెలియజేసింది.

ఈ ప్రాజెక్ట్- డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతి నిర్మితమౌతుంది. నిర్మాణ వ్యయం మొత్తం 4,081.28 కోట్ల రూపాయలు. ఈ రోప్‌వేను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనుంది. దీనికి అవసరమైన అన్ని రకాల ప్రణాళికలను వేగవంతం చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
అత్యంత అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) సాంకేతికత ఆధారంగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. గంటకు 1,800 మంది చొప్పున రోజుకు 18,000 మంది భక్తులను మోసుకెళ్లేలా ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలాను డిజైన్ చేస్తారు. పర్యావరణానికి అనుకూలంగా, సౌకర్యవంతంగా, వేగవంతంగా కనెక్టివిటీని అందిస్తుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్ వరకు ప్రస్తుతం ఉన్న సమయాన్ని దాదాపు 8 నుండి 9 గంటల వరకు తగ్గించగలుగుతుంది. గౌరీ కుండ్ నుండి 16 కిలోమీటర్ల ఎత్తున ఉంటుంది కేదార్‌నాథ్ ఆలయం. ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం కాలినడకన లేదా గుర్రాలు, పల్లకీ, హెలికాప్టర్ ద్వారా భక్తులు రాకపోకలను సాగిస్తోన్నారు. దీన్ని సులభతరం చేయడానికి రోప్ వే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది.
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదార్‌నాథ్ ఆలయం. అత్యంత శక్తిమంతమైన ద్వాదశ పవిత్ర జ్యోతిర్లింగాలలో ఇదీ ఒకటి. ఈ ఆలయం అక్షయ తృతీయ (ఏప్రిల్-మే) నుండి దీపావళి (అక్టోబర్-నవంబర్) వరకు సంవత్సరంలో దాదాపు 6 నుండి 7 నెలల పాటు యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది. ఈ సీజన్‌లో ఏటా దాదాపు 20 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications