లెక్క తేల్చడానికి ఎంట్రీ ఇస్తున్న చాణుక్యుడు, దెబ్బకు దెబ్బ కొట్టడానికి పక్కాప్లాన్, జాతర పేరుతో !
అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న బీజేపీ హైకమాండ్ నేతలు ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలో పర్యటించడానికి పక్కాప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చితకలపడిన బీజేపీ హైకమాండ్ నేతలు ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ హైకమాండ్ లో నెంబర్ టూ అయిన అమిత్ షా పర్యటన ఖరారు అయ్యింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి కర్ణాటక రాష్ట్రంలో పర్యటించడానికి సర్వం సిద్దం చేశారు. అమిత్ షా ఎంట్రీతో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ చాణక్యుడు అమిత్ షా మైసూర్ జిల్లాలో పర్యటించారు. ఫిబ్రవరి 10వ తేదీ మైసూరులోని మందకనహళ్లి విమానాశ్రాయినికి రాత్రి 10. 50 గంటలకు అమిత్ షా చేరుకుంటారు.

అమిత్ షా మందకహళ్లి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన అమిత్ షా కార్యక్రమాలను బీజేపీ నాయకులు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు అమిత్ షా చాముండి కొండకు చేరుకుని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. చాముండి అమ్మవారి దర్శనానంతరం 11. 45 గంటలకు హెలికాప్టర్‌లో సుత్తూరు గ్రామాని వెలుతున్న కేంద్ర మంత్రి అమిత్‌షా సుత్తూరు జాతరలో పాల్గొంటారు.
మద్యాహ్నం 1.30 గంటలకు అమిత్ షాకు సుత్తూరు మఠంలో భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. సుత్తూరు మఠంలో భోజనం ముగించుకుని 2.30 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకుంటారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న అమిత్ షా బీజేపీ నేతలతో చర్చించి ఎవరెవరికి ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని అని చర్చలు జరపనున్నారు. బీజేపీ చాణుక్యుడు అమిత్ షా సుత్తూరు జాతర మహోత్సవాన్ని సాకుగా చూపి లోక్ సభ ఎన్నికల వ్యూహరచన చేసేందుకు కర్ణాటకకు రానున్నారని తెలిసింది.
లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు కుదిరిన తర్వాత ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు, పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. అమిత్ షా పర్యటనలో దాదాపుగా ఎంపీ టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఓ కొలిక్కి తీసుకురావాలని కర్ణాటక బీజేపీ నాయకులు అంటున్నారు. అమిత్ షా పర్యటన విజయవంతం చెయ్యడానికి కర్ణాటక బీజేపీ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications