కోట్లలో డీల్ చేసిన చైత్రా, నాకు సంబంధంలేదని చెప్పిన కేంద్ర మంత్రి శోభా మేడమ్ !

బెంగళూరు/ఉడిపి: అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే కచ్చితంగా శాసన సభ్యుడు అవుతారని, మీరు ఎమ్మెల్యే అయితే మీ వ్యాపారాలు ఇంకా పెరిగి కోట్ల రూపాయలు డబ్బులు సంపాధిస్తారని, మీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించే బాధ్యత నాదే అంటూ ప్రముఖ వ్యాపారి దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఓ లేడీ లీడర్ తో పాటు చాలా మందిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

హిందూ సంఘ సంస్థ నాయకురాలు అయిన కర్ణాటకకు చెందిన చైత్రా కుందాపుర ఈ కేసులో కింగ్ పిన్ అని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్ ఇప్పిస్తానని ప్రముఖ వ్యాపారి, బీజేపీ నాయకుడు గోవింద బాబు పూజారి నుంచి చైత్రా కుందాపుర రూ. 7 కోట్లు డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ కేసు నమోదు అయ్యింది.

 Union Minister Shobha Karandlaje has clarified that she has no contact with Chaitra Kundapura

ఇప్పటికే హిందూ సంఘ సంస్థ నాయకురాలు చైత్రా కుందాపురతో సహ చాలా మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తాను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చెయ్యలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే తనను కేసులో ఇరికించారని హిందూ సంఘ సంస్థ నాయకురాలు చైత్రా కుందాపుర ఆరోపిస్తున్నారు.

చైత్రా కుందాపుర విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు శోభా కరంద్లాజే స్పందించారు. తనకు చైత్రా కుందాపురకు ఎలాంటి సంబందంలేదని, ఆమె నాకు ఇంత వరకు పరిచయం కూడా లేదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. ఉడిపిలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలని ఆమె అన్నారు.

 Union Minister Shobha Karandlaje has clarified that she has no contact with Chaitra Kundapura
చైత్రా కుందాపుర కేసు విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరగాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చెప్పారు. కేంద్రంలో, కర్ణాటకలోని బీజేపీ నాయకుల పేర్లును దుర్వినియోగం చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఇందులో ఎవరు ఉన్నా వదిలిపెట్టకూడదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చెప్పారు.

తాను ఏదైనా బహిరంగ సభలు, సమావేశాలకు హాజరు అయిన సమయంలో అందరితో పాటు చైత్రా కుందాపుర కూడా ఫోటోలు తీసుకుని ఉండవచ్చని, అంతమాత్రానా తనకు ఆమెకు ఎలాంటి సంబంధంలేదని, ఆమెతో తనకు ఇంతవరకు పరిచయం కూడా లేదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే క్లారిటీ ఇచ్చారు. అయితే చైత్రా కుందాపురకు ఈ కేసుతో సంబంధంలేకపోతే ఆమెను ఇబ్బంది పెట్టకూడదని కూడా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+