ముస్లిం మహిళలు గోళ్లు కత్తిరించుకోకూడదు, నెయిల్‌పాలిష్ వేసుకోవద్దు: ఫత్వా జారీ
లక్నో: దారుల్ ఉలూమ్ దియోబంద్.. ముస్లిం మహిళలపై మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు గోళ్లు కత్తిరించుకోకూడదని, అలాగే నెయిల్ పాలిష్ కూడా వేసుకోరాదని ఫత్వాలో పేర్కొంది. గోళ్లు కత్తిరించుకోవడం, గోళ్లకు రంగులు వేసుకోవడం ఇస్లాంకు వ్యతిరేకమని దారుల్ ఉలూమ్ సభ్యుడు ముఫ్తి ఇష్రార్ గౌర తెలిపారు.
అయితే, మహిళలు గోరింటాకు పెట్టుకోవడంపై మాత్రం నిషేధం లేదని చెప్పారు. పురుషులు షేవింగ్ చేసుకోవడం ఇస్లాంకు ఎలా వ్యతిరేకమో.. ముస్లిం మహిళలు కనుబొమ్మలను ట్రిమ్ చేసుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం, తల వెంట్రుకలు కట్ చేయడం కూడా అలాగే వ్యతిరేకమని ముఫ్తి తెలిపారు.

ముస్లిం మహిళలు బ్యూటీపార్లర్లకు వెళ్లడం సరికాదని వ్యాఖ్యానించారు. గతంలో కూడా దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇలాంటి ఫత్వాలను జారీ చేసింది. పరపురుషులను ఆకర్షించే విధంగా ముస్లిం మహిళలు తయారుకాకూడదని పేర్కొంది.












Click it and Unblock the Notifications