ఒకే టీచర్: 25 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డు, 13 నెలల్లో రూ.కోటీ విత్ డ్రా, ఛీటింగ్‌పై ఎంక్వైరీ
తల్లి, తండ్రి తర్వాత గురువుదే స్థానం. విద్యాబుద్దులు నేర్పి, దారిచూపే గురువు కొన్నిచట్ల దారితప్పుతున్నాడు. కొందరు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా.. మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయురాలు ఇలానే ఛీట్ చేశారు. మోసం అంటే మామూలు మోసం కాదు.. ఒకచోటనే పనిచేస్తూ... 25 పాఠశాలల్లో పనిచేస్తున్నానని కలరింగ్ ఇచ్చింది. అలా ప్రభుత్వం నుంచి రూ.కోటి వసూల్ చేసింది.

టీచర్: అనామిక శుక్తా..
వాస్తవానికి టీచర్ల డాటాబేస్ వెలికితీస్తుండగా విషయం బయటపడింది. లేదంటే ఆమె మరెన్ని రోజులు ప్రభుత్వాన్ని మోసం చేసేవారో. 2020 ఫిబ్రవరి వరకు 13 నెలల నుంచి విద్యాశాఖ నుంచి రూ.కోటి రూపాయల జీతం తీసుకుంది. కానీ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంది.

ఇలా బయటపడింది
డాటాబేస్ తీస్తుండగా అనామికా శుక్లా.. మోసం బయటపడింది. అమేథీ, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, ప్రయాగ్ రాజ్, అలీఘర్ సహా 25 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులో ఉంది. కానీ ఆమె ఒకచోటకి వెళ్లి మాత్రమే పాఠాలు చెబుతోంది. ఘటనపై విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. దర్యాప్తు జరుపుతున్నామని.. తాము నోటీసులు పంపించినా అనామికా స్పందించడం లేదు అని పేర్కొన్నారు.

ఓకే అకౌంటా..?
విద్యాశాఖ నుంచి నెల నెల జీతాన్ని అనామికా ఎలా డ్రా చేసిందనే అంశంపై స్పష్టత లేదు. 25 స్కూళ్లకు కలిపి ఓకే శాలరీ అకౌంట్ ఇచ్చిందా..? వేర్వేరు ఖాతాలు ఇచ్చిందనే అంశంపై క్లారిటీ లేదు. అనామికా మోసం తెలియడంతో ఆమెకు వేసవిలో ఇవ్వాల్సిన జీతాన్ని నిలిపివేశారు.

చర్యలు తప్పవు
అనామికాపై మోసంపై దర్యాప్తు ప్రారంభించామని, నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి సతీశ్ ద్వివేది తెలిపారు. స్కూళ్లలో పారదర్శకత కోసం డిజిటల్ డాటాబేస్ రూపొందిస్తున్నామని.. కానీ టీచర్ మోసం బహిర్గతమైందన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్న ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. వాస్తవానికి కేజీబీవీలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు జరుగుతున్నాయని.. అనామికా పర్మినెంట్ ఉద్యోగా లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనే విషయం త్వరలో తేలుతుందని చెప్పారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications