వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ మేనల్లుడు.. పోలీస్ స్టేషన్‌లో రచ్చ, కాలర్ పట్టుకుని చెంపదెబ్బ!

టెక్నీషియన్స్‌తో పాటు వైద్యులపై దాడి చేశాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మోహిత్ ను అదుపులోకి తీసుకోగా.. పోలీస్ స్టేషన్ లోను అతను రెచ్చిపోయాడు.

|
Google Oneindia TeluguNews

లక్నో: చాలామంది పొలిటిషియన్స్.. అధికారం రాగానే అన్నింటా తామే ముందన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. వారి అండ చూసుకుని చుట్టూ ఉన్న అనుచర ఘనం కూడా రెచ్చిపోతుంటారు. ఎక్కడికెళ్లినా.. తమకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, తామేదో వీఐపీలమని ఫీలైపోతుంటారు.

తాజాగా యూపీలోను ఓ ఎమ్మెల్సీ బంధువులు ఇలాగే వ్యవహరించారు. వైద్య పరీక్షల కోసం ఇతా జిల్లాలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన ఎస్పీ నేత రమేశ్ యాదవ్ మేనల్లుడు మోహిత్ యాదవ్ తండ్రి అక్కడ పేచీకి దిగాడు. ఎక్స్‌రే తీయించుకోవాల్సిందిగా వైద్యులు చెప్పడంతో.. మెడికల్ ల్యాబ్ వద్దకు వెళ్లాడు.

Uttar Pradesh shocker: In Etah, SP neta's nephew thrashes cops

ల్యాబ్ ఎదుట అప్పటికే చాలామంది క్యూ కట్టడంతో.. వారందరిని కాదని, తాను వీఐపీని అని, తనను ముందు లోపలికి వెళ్లనివ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. అయితే ల్యాబ్ టెక్నీషియన్స్ అతన్ని క్యూ లో రావాలని ఆదేశించడంతో.. అతని కుమారుడు మోహిత్ నానా రభస చేశాడు.

టెక్నీషియన్స్‌తో పాటు వైద్యులపై దాడి చేశాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మోహిత్ ను అదుపులోకి తీసుకోగా.. పోలీస్ స్టేషన్ లోను అతను రెచ్చిపోయాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ జితేంద్రకుమార్‌ ను చెంపదెబ్బ కొట్టాడు. చొక్కా కాలర్ పట్టుకుని వెనక్కి తోసేశాడు. ఆపై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మోహిత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కఠినంగా శిక్షించేందుకు సిద్దమవుతున్నారు.

English summary
In a shocking incident, a Samajwadi Party MLC's nephew - Mohit - has been filmed assaulting policemen in Uttar Pradesh's Etah. It all started with an altercation at a district hospital, where Mohit had gone for an X-ray. He first attacked the technician, then the doctor, and when he was hauled up by the cops, he attacked them too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X