Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తరాఖండ్, దేశ రాజధాని ప్రాంతంలో భూకంపం: 4.5గా తీవ్రత నమోదు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ తోపాటు ఉదయం 8:33 గంటల ప్రాంతంలో దేశ రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలంతా తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.

Uttarakhand Earthquake magnitude of 4.5 Tehri uttarakashi, dehradun, Tremors Felt In Delhi-NCR

రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ తోపాటు ఉత్తరకాశీ, బర్కోట్, తెహ్రీ, ముస్సోరీలలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. తెహ్రీ కేంద్రంగా భూకంపం సంభవించింది.

ఎన్సీఎస్ ప్రకారం.. భూకంపం 5 కిలోమీటర్ల లోతు, 30.67 అక్షాంశాలు, 78.60 రేఖాంశాల తీవ్రతను కలిగి ఉంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం ఉత్తరం వైపుగా కదులుతుండటంతో హిమాలయాల్లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. గతంలో 2015లో దీని కారణంగానే నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దీని కారణంగా 8వేల మందికిపైగా మరణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+