ఏపీకి వందే భారత్ స్లీపర్: రూట్ ఇదే

Vande Bharat sleeper express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

Vande Bharat sleeper trains will start its operations within 2 months

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. స్లీపర్ రైలు కోచ్‌లు చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో తుది మెరుగులు దిద్దుకుంటోన్నాయి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్.. ఈ కోచ్‌ను డిజైన్ చేసింది.

వందే భారత్ స్లీపర్ రైళ్లపై తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన చేశారు. ఇంకో రెండు నెలల్లో వాటిని పట్టాల మీదికి తీసుకుని రానున్నట్లు చెప్పారు. ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్‌, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా స్లీపర్ బెర్త్‌లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆకర్షణీయంగా కనిపించేలా ఈ రైళ్లు రూపుదిద్దుకుంటోన్నాయని అన్నారు.

ఫ్రంట్ నోస్ కోన్ నుంచి టెయిల్ ఎండ్ వరకూ అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తోన్నామని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇంటీరియర్ ప్యానెల్స్, సీటింగ్, బెర్త్‌, లైటింగ్, కోప్లర్స్, గ్యాంగ్‌వే.. ఇలా ప్రతి అంశాన్ని ప్రయాణికులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేస్తోన్నామని అన్నారు. బీఈఎంఎల్ ఇచ్చిన డిజైన్లను క్షుణ్నంగా పరిశీలించాకే అనుమతులు ఇచ్చామని చెప్పారు.

మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు.. రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని మంత్రి చెప్పారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 250 స్లీపర్ రైళ్లను నడిపించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఈ వందే భారత్ స్లీపర్ రైలును భువనేశ్వర్- విశాఖపట్నం మధ్య నడిపించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్న అత్యంత రద్దీ రూట్లల్లో ఒకటి కావడం వల్ల ఈ మార్గంలో దీన్ని నడిపించాలని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు మరో నాలుగు రూట్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+