వందే మాతరం గీతంపై కేంద్రం సంచలనం.. ఇకపై ఇదే..!!

నరనరాల్లో దేశభక్తిని ఉప్పొంగింపజేసే వందే మాతరం గీతంపై కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది. సరైన మర్యాదను పాటిస్తూ గౌరవం ఇచ్చేలా మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ గీతానికి సంబంధించిన అధికారిక వర్షన్ ఆలపించేటప్పుడు గానీ, వినిపించేటప్పుడు గానీ ఇకపై లేచి నిల్చోవడం తప్పనిసరి. శ్రోతలు అటెన్షన్‌లో లేచి నిల్చోవాలి. సామూహిక గీతాలాపనతో పాటు దీని పఠనం తప్పకుండా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశించింది.

సినిమా హాళ్లలో న్యూస్‌రీల్స్ లేదా డాక్యుమెంటరీల సమయంలో ఇది ప్లే అయితే నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే వందేమాతరంతో పాటు జనగణమన అధినాయక జయహే.. జాతీయ గీతం రెండింటినీ పాడాల్సి వచ్చిన సందర్భంలో అనుసరించాల్సిన విధి విధానాలు కూడా ఇందులో ఉన్నాయి. జనగణమన కంటే వందేమాతరాన్ని ముందుగా ఆలపించడం తప్పనిసరి అని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.

Vande Mataram Protocols released Played Before Jana Gana Mana at All Govt Functions and Schools

1937లో తొలగించిన నాలుగు చరణాలతో సహా వందేమాతరం ఆరు చరణాలనూ కూడా పూర్తిగా ఆలపించాల్సి ఉంటుంది ఇకపై. అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం వేడుకలతో పాటు రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాలలోనూ వందేమాతరం గీతాన్ని పూర్తిగా వినిపించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి రాక, నిష్క్రమణ వేళలు పాఠశాలల్లో విద్యార్థులలో జాతీయ గేయం, వందేమాతరం గీతం, జెండా పట్ల గౌరవం పెంపొందించే ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాల్లో పొందుపర్చారు.

'వందేమాతరం' గీతానికి అధిక ప్రాచుర్యం కల్పించే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు అన్ని అధికారిక కార్యక్రమాలలో కూడా ఆరు చరణాలతో 3:10 సెకన్ల నిడివి కలిగిన ఈ గీతాన్ని పాడటం లేదా అధికారిక వర్షన్ ను ప్లే చేయడం తప్పనిసరి. త్రివర్ణ పతాకావిష్కరణలు, రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు అలాగే ఆయన ప్రసంగాలు, దేశీయ ఉపన్యాసాల వంటివి.. ఈ అధికారిక కార్యక్రమాల్లో ఉన్నాయి.

ఆయన రచించిన 1882 నాటి 'ఆనందమఠ్' నవలలో ఇది ప్రచురితమైంది. స్వాతంత్య్రానంతరం 1950లో గేయం మొదటి రెండు చరణాలను భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించారు. జనగణమన అధినాయక జయహే మాదిరిగా కాకుండా, వందేమాతరం ఆలపించడానికి ఇంతవరకు నిర్దిష్ట ప్రొటోకాల్ లేదనే విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ప్రస్తుత మార్గదర్శకాలు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+