ముంబైను వణికిస్తున్న వర్షాలు.. భారీగా వరదనీరు చేరడంతో జనం బెంబేలు..
ముంబై : ముంబైవాసులను వర్షాలు వదిలిపెట్టడం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఎడతెరిపిలేకుండా వానలు పడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ముంబైలో గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ముప్పు ఇప్పట్లో తప్పేలా కనిపించడంలేదు. శనివారం కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం సైతం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బృహన్‌ముంబై కార్పొరేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడింది. ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ప్రతికూల వాతావరణం ఉన్నందున ప్రజలు సముద్రం దగ్గరకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మ్యాన్ హోల్‌లు ఓపెన్ చేయవద్దని చెప్పారు. శనివారం మధ్యాహ్నం భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన ముంబై కోల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి వెయ్యి మంది ప్రయాణీకులను సురక్షితంగా రక్షించినట్ు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. వారిని కల్యాణ్ జంక్షన్‌కు తీసుకొచ్చి స్పెషల్ ట్రైన్లో గమ్యస్థానాలకు పంపారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications