విహెచ్‌పి నేత అశోక్ సింఘాల్ ఆరోగ్యం విషమం
అయోధ్య: విశ్వహిందూ పరిషత్ కీలక నేత అశోక్ సింఘాల్ ఆరోగ్యం మరింత విషమించింది. తీవ్ర అనారోగ్యంతో ఆయన శనివారం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉందనీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారని వీహెచ్‌పీ వర్గాలు వెల్లడించాయి.
89ఏళ్ల సింఘాల్ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అక్టోబరు 20న ఇదే ఆస్పత్రిలో చేరి మూడ్రోజుల కిందే ఇంటికొచ్చారు.
సింఘాల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతున్నదని మేదాంత ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే దూబే అన్నారు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యవసర విభాగంలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

హిమాచల్ సీఎంపై మనీలాండరింగ్ కేసు
ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటు(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత సెప్టెంబరులో సింగ్‌పై సీబీఐ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది.
2009-11 మధ్యకాలంలో సింగ్ కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.6.1 కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సింగ్, అతడి భార్య ప్రతిభాసింగ్, ఎల్‌ఐసీ ఏజెంట్ ఆనంద్‌చౌహాన్, అతడి సోదరుడు సీఎల్ చౌహాన్ ఉన్నారు.
సింగ్ 2009లో జీవితబీమాలో రూ.6.1 కోట్లు మదుపు చేశారని, ఈ డబ్బంతా వ్యవసాయం నుంచి వచ్చినట్లు సింగ్ చెప్పారని సీబీఐ పేర్కొంది. ఈ మొత్తాన్ని చట్టబద్ధం చేసేందుకు 2012లో ఆయన ప్రయత్నించారని వెల్లడించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications