శశికళే సీఎం కావాలి: విజయశాంతి షాకింగ్ కామెంట్స్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళే తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చెప్పారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు .
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళే తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చెప్పారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు తనను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే పార్టీని ఐక్యంగా ఉంచేందుకు జయలలిత ఎంతో కృషి చేశారని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలితను భర్తీ చేసేందుకు శశికళే సరైన నాయకురాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తాను శశికళకే మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో చాలా మంది సినీ ప్రముఖులు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలుకుతుండగా.. విజయశాంతి మాత్రం శశికలకు మద్దతు పలకడం గమనార్హం.

కాగా, గతంలో కూడా విజయశాంతి.. శశికళే సీఎం కావాలని ఆకాంక్షించారు. జయలలిత మరణించిన అనంతరం శశికళను కలిసిన ఆమె.. శశికళకు మద్దతు తెలిపారు. జయ తర్వాత అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని నడిపించేది శశికళే అని ఆమె అభిప్రాయపడ్డారు.
బీజేపీ కుట్రలు
తమిళనాడులో భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదని మండిపడ్డారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications