Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వక్ఫ్ బోర్డులో అత్యంత క్రూరమైన నిబంధన అదే- సవరణల బిల్లుకు కొత్త పేరు

Waqf amendment Bill: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభ సమక్షానికి వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. సవరణల బిల్లు స్వభావం గురించి వివరించారు.

వక్ఫ్ చట్టం 1995లో అత్యంత వివాదాస్పదమైన సెక్షన్ 40ని రద్దు చేయాలని ప్రతిపాదించినట్లు కిరణ్ రిజుజు తెలిపారు. ఈ సెక్షన్‌ను ప్రయోగించడం ద్వారా ఏదైనా ఒక భూమిని తమ ఆస్తిగా మార్చుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందని అన్నారు. దీన్ని పూర్తిగా తొలగించాలని సవరణల బిల్లులో ప్రతిపాదించినట్లు వివరించారు.

Waqf Amendment Bill proposes to repeal Section 40 of the 1995 Act says Kiren Rijiju

ఈ సెక్షన్ 40ను అత్యంత దారుణమైన, క్రూరమైన (Most Draconian) నిబంధనగా అభివర్ణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వక్ఫ్ చట్టంలోని అత్యంత దారుణమైన నిబంధన సెక్షన్ 40. దీని ప్రకారం ఆ బోర్డు ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించగలదు. ఇప్పుడు దాన్ని తొలగించాం.. అని రిజిజు తెలిపారు.

ఈ బిల్లు వల్ల ముస్లింల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని, వక్ప్ ఆస్తులకు రక్షణ ఉండబోదంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారని, అది అపోహ మాత్రమేనని అన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎవ్వరి భూమిని కూడా లాక్కోవడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు సెక్షన్ 40 నిబంధనను దుర్వినియోగం చేస్తోన్నారని కిరణ్ రిజిజు ఆరోపించారు. అందుకే వక్ఫ్ ఆస్తులు లక్షల్లో పెరిగాయని వ్యాఖ్యానించారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు యుమీద్ (Umeed Bill) అంటే- యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు గా పేరు మారుస్తున్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు.

సెక్షన్ 40 ప్రకారం- ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుకు సంబంధించినదా? కాదా? అని నిర్ణయించే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందని, వక్ఫ్ ట్రిబ్యునల్ దాన్ని చేయకపోయినా లేదా మార్పు చేయకపోయినా తుది నిర్ణయం బోర్డుదే అవుతుందని కిరణ్ రిజిజు వివరించారు. ఆ స్థలం వక్ఫ్ పరం కావడానికే అవకాశం అధికంగా ఉందని చెప్పారు. వాటిపై కోర్టుల్లో అప్పీల్ చేయడానికి అనుమతి లేదని పేర్కొన్నారు.

Waqf Amendment Bill proposes to repeal Section 40 of the 1995 Act says Kiren Rijiju

ఇలాంటి వివాదాలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తోన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 14,000కు పైగా వక్ఫ్ ఆస్తుల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉంటే- న్యాయస్థానాలను ఆశ్రయించే అవకశాన్ని ఈ సవరణల ద్వారా కల్పిస్తోన్నామని, దీన్ని మరింత సులభతరం చేశామని చెప్పారు.

ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా? లేదా? అనే అధికారం ఈ సవరణల ద్వారా జిల్లా కలెక్టర్‌కు లభిస్తుందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. క్యాథలిక్ క్రైస్తవులు కూడా వక్ఫ్ బిల్లును ఆమోదించాలని కోరుకుంటోన్నట్లు చెప్పారు. కేరళలోని ఓ మత్స్యకార గ్రామంలో 600కు పైగా క్రైస్తవ కుటుంబాలు నివసించే భూమిని, చర్చిని తమదిగా వక్ప్ బోర్డు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే- హర్యానాలోని జత్లానలో గురుద్వారా భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో సవరణలు గనక చేయకపోతే పార్లమెంట్ భవనం, ఢిల్లీ విమానాశ్రయం, సీజీవో కాంప్లెక్స్‌లను కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అవకాశం ఉండేదని రిజిజు వ్యాఖ్యానించారు.

వక్ఫ్ చట్టాన్ని తొలగించే అవకాశం ఉందా..?

లేదు. వాకిఫ్ నుంచి ఆస్తులు అల్లాకు బదిలీ చేయడంవల్ల వాటిని తిరిగి పొందే అవకాశం లేదు.ఒక్కసారి ఆ ఆస్తులు వక్ఫ్‌కు చెందినవని అధికారికంగా ప్రకటించిన తర్వాత అవి ఎప్పటికీ వక్ఫ్ ఆస్తులుగానే నిలిచిపోతాయి.

వక్ఫ్ బోర్డు ఎవరి నియంత్రణలో ఉంటుంది?

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్‌ను పర్యవేక్షిస్తుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సంబంధించి పాలనాపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో కేంద్ర మంత్రి వక్ఫ్ ఇంఛార్జిగా వ్యవహరిస్తూ ఎక్స్ అఫీషియో ఛైర్మెన్‌గా ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+