ఓ హిందువై ఉండి..: చర్చిలో మోదీ ఈస్టర్ ప్రార్థనలపై దుమారం

న్యూఢిల్లీ: ఈస్టర్ సండే నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీకే చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువై ఉండి.. ప్రధాని మోదీ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనడం వ్యూహాత్మకమా లేక ఉద్దేశపూరకమా? అంటూ ప్రశ్నించారు.

ఆదివారం సాయంత్రం మోదీ ఢిల్లీలోని శాక్ర్డ్ హార్ట్ క్యాథడ్రెల్ క్యాథలిక్ చర్చ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఏసు క్రీస్తు విగ్రహం ముందు కొవ్వొత్తిని వెలిగించి, కొద్దిసేపు ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడే చర్చి ఫాదర్ బిషప్ అనిల్ ఖుటో, ఫ్రాన్సిస్ స్వామినాథన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఓ ప్రధానమంత్రి- ఈ చర్చికి వెళ్లడం అదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 Modi praying in a Church

ఈస్టర్ సండేను పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు మోదీ. ఈస్టర్ సండే జరుపుకోవడం ఓ ప్రత్యేక సందర్భమని, సమస్త మానవాళికి, సమాజానికి సామరస్య స్ఫూర్తిని పంచిన రోజుగా అభివర్ణించారు. అణచివేతకు గురవుతున్న వారిని ఆదుకోవాలని, వారికి చేయూత అందించాల్సిన బాధ్యతను ఈస్టర్ సండే గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. క్రీస్తు పవిత్రమైన ఆలోచనలను స్మరించుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

దీనిపై ఇవ్వాళ సుబ్రహ్మణ్య స్వామి కీలక ప్రశ్నలను సంధించారు. ఢిల్లీలోని మిషనరీ చర్చిలో మోదీ ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం వ్యూహాత్మకమా లేక ఉద్దేశపూరకమా? అనేది తేలాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓ హిందువుగా, తనకు అన్ని మతాల్లోనూ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.

మతం విషయంలో తాను మూర్ఖుడిగా వ్యవహరించలేనని తేల్చి చెప్పారు. క్యాథడ్రెల్ క్యాథలిక్ చర్చికి- అది కూడా ఈస్టర్ నాడు వెళ్లడం ద్వారా మోదీ మన హిందూత్వ బంధువులకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారని ప్రశ్నించారు. హిందుత్వ అనేది మోదీ అనుసరిస్తోన్న బూటకపు భావజాలమా లేక కపటమా అనేది స్పష్టం కావాలని చెప్పారు. క్రైస్తవులను బుజ్జగిస్తోన్నారా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+