VIDEO:బీజేపీ ఎంపీ నోటీ దూల.. డ్రింక్, స్మోక్, గుట్కా తినాలని, వాటర్ సేవ్ కార్యక్రమంలో..
స్టేజీ ఎక్కగానే కొందరు నేతలకు సోయి ఉండటం లేదు. మైక్ ఉంది కదా అని ఎటు వస్తే.. అటు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా మధ్యప్రదేశ్ రెవాలో కూడా ఓ ఎంపీ కామెంట్ చేశారు. నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని.. ఇలా తన నోటి దురుసును ప్రదర్శించారు. నీటి సంరక్షణ చేయాలంటే ఇలా చేయాలి అంటూ.. కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

పొదుపుగా నీరు..
నీటి సంరక్షణ ముఖ్యం అని చెప్పాలి. నీటిని పొదుపుగా వాడాలని సజెస్ట్ చేయాలి. లేదంటే ఇంకుడు గుంతలు విధిగా ఏర్పాటు చేయాలని కోరాలి. కానీ బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా మాత్రం అందుకు విరుద్దంగా కామెంట్ చేశారు. మద్యం తాగాలని, గుట్కా నమలాలి అని, సిగరెట్ తాగాలని కోరారు. అదీ కూడా నీటి సంరక్షణ గురించి జరిగిన వేదికపై ఇలా మాట్లాడారు.

ప్రత్యామ్నాయం..
అధిక ఉష్ణోగ్రత వల్ల నీటి ఎద్దడి ఏర్పడుతుందని తెలిపారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఇలా చేయాలని సూచించారు. కానీ చాలా మంది బోర్లు వేస్తున్నారని.. గొట్టపు బావులు తవ్వడం వల్ల జలశయాలు వద్ద కూడా నీరు అడుు అంటుతుందని తెలిపారు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని తెలిపారు.

భావి తరాలు ఇబ్బంది..
నీటి వాడకం తగ్గించాలని కోరారు. భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేవారు. అందుకోసమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీరు సేవ్ చేయాలని తెలిపారు. అవసరమైతే డబ్బును వృధా చేయాలని సూచించారు. కానీ నీటిని మాత్రం జాగ్రత్తగా వాడాలని అభిప్రాయ పడ్డారు.
మత్తు మంచిది కాదంటూనే..
ప్రజలు మతపరమైన కార్యకలాపాలు లేదంటే వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుబడి పెట్టొచ్చని.. అయితే అందులో కొంత మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించాలని కోరారు. అతను చెప్పిన నీటి సంరక్షణ కార్యక్రమం మంచిదే కానీ.. అందుకోసం మందు తాగాలని చేయాలని.. స్మోక్ చేయాలని చెప్పడమే తప్పు. దీనిపై దుమారం చెలరేగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications