Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మమత-నితీష్ కుమార్ భేటీ: కీలక నిర్ణయాలు: కేసీఆర్ మిస్

కోల్‌కత: వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే దేశ రాజధానిలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

ఈ దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. ఇవ్వాళ కోల్‌కతకు చేరుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిందీ సమావేశం. పలు అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి.

mamata banerjee nitish kumar

వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించి వారు మాట్లాడారు. కార్పొరేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం, నిత్యావసర సరుకులపై జీఎస్టీని విధించడం, ధరల పెరుగుదల.. వంటి అంశాలుపై చర్చించారు.

వివిధ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న అంశాలను పరిష్కరించడానికి కేంద్రం శ్రద్ధ చూపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీన్ని అడ్డుకోవడానికి-సైద్ధాంతికపరమైన విభేదాలను పక్కన పెట్టి పని చేయాల్సి ఉంటుందని, అప్పుడే గెలుపు సాధ్యపడుతుందంటూ అంచనావేశారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం మమత బెనర్జీ, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్- జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు, కలిసికట్టుగా పని చేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు. తమ మధ్య ఎలాంటి ఈగోలు లేవని మమత బెనర్జీ తేల్చి చెప్పారు. అందరం కలిసి ముందుకు వెళ్తామని, సమష్టిగా కలిసి పనిచేయాలనుకుంటున్నామని వివరించారు.

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ తన ఉద్యమాన్ని బిహార్ నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు బిహార్ నుంచే తమ పోరాటం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సమావేశాన్ని బిహార్‌లో ఏర్పాటు చేయాలని నితీష్ కుమార్‌ను కోరినట్లు మమత బెనర్జీ చెప్పారు. అంతకంటే ముందు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నామని సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మమత బెనర్జీ.

దేశంలో బీజేపీ జీరో కావాలనేదే తన అభిమతమని మమత పేర్కొన్నారు. మీడియా మద్దతు, అబద్ధాలతో బీజేపీ నాయకులు పెద్ద హీరోలయ్యారంటూ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేవి తెలిసిన విషయమేనని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+