అదానికి ఎంత కావాలంటే అంత లోన్ ఇస్తాం- జాతీయ బ్యాంక్ సంచలన ప్రకటన..!!

హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటికొచ్చిన తరువాత ఎదురుదెబ్బలను చవి చూస్తోన్న గౌతమ్ అదానికి ఊరట లభించింది. ఆయనకు అడిగినంత లోన్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గౌతమ్ అదాని సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ నివేదిక అటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దుమారానికి దారి తీసింది.

జాగ్రత్తగా ఉండు- బాలయ్యను హెచ్చరించిన పిచ్చోడు: తారకరత్న భౌతికకాయం వద్ద షాకింగ్

 దర్యాప్తునకు ససేమిరా..

దర్యాప్తునకు ససేమిరా..

ప్రతిపక్షాలు చేస్తోన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవట్లేదు. హిండన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టినప్పటికీ.. దాన్ని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోందే గానీ జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి అంగీకరించట్లేదు.

సుప్రీంకోర్టు జోక్యంతో..

సుప్రీంకోర్టు జోక్యంతో..

ఇందులో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. హిండన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

జాతీయ బ్యాంక్ సంచలన ప్రకటన..

జాతీయ బ్యాంక్ సంచలన ప్రకటన..

ఈ పరిణామాల మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా సంచలన ప్రకటన చేసింది. గౌతమ్ అదానికి అడిగినంత లోన్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దేశీయ స్టాక్ మార్కెట్ లో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్ల వాల్యూ పడిపోవడం, అస్థిరతను తాము పరిగణనలోకి తీసుకోవట్లేదని తెలిపింది. అదాని అడిగిందే తడవుగా రుణాలను మంజూరు చేస్తామని పేర్కొంది.

నిబంధనలకు లోబడి..

నిబంధనలకు లోబడి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే చాలు- గౌతమ్ అదానికి రుణాలను అందజేస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ ఛద్దా తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ వద్ద ఉన్న రుణ సంబంధ ప్రతిపాదనలను విలువను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

ధారవి మెగా ప్రాజెక్ట్ కోసం..

ధారవి మెగా ప్రాజెక్ట్ కోసం..

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవి రీడెవలప్‌ మెంట్ ప్రాజెక్ట్ కోసం అదాని గ్రూప్ కు రుణాలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఛద్దా చెప్పారు. గత ఏడాది మురికివాడల పునర్నిర్మాణం కోసం అదానీ గ్రూప్ 50.7 బిలియన్ల బిడ్ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికి అవసరమైన లోన్ ను తాము అందిస్తామని అన్నారు. ముందస్తు చెల్లింపులు, సమయానికి లోన్ మొత్తాన్ని వెనక్కి చెల్లించే రుణగ్రహీతలను తాము వదులుకోదలచుకోలేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+