మాధవీలత బిగ్ స్టేట్‌మెంట్..

Telangana Lok Sabha Election Results 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉత్కంఠతతో ఫలితాల గురించి ఎదురు చూస్తోన్నారు. కౌంటింగ్ డే కావడంతో ప్రత్యేక పూజల్లో పాల్గొంటోన్నారు.

తెలంగాణలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కిందటి నెల 13వ తేదీన సింగిల్ ఫేస్‌లో పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి కిందటే మొదలయ్యాయి. ఒక్కొటొక్కటిగా వెలువడుతున్నాయి. గెలుపు తమనే వరిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తోన్నాయి.

BJP MP candidate Madhavi Latha said that the We will get 400 paar

ఈ పరిస్థితుల్లో- హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత ఈ ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లే ముందు ఆమె ఆలయాన్ని సందర్శించారు. పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆమె తనను కలిసిన విలేెకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతోందని అన్నారు. కేంద్రంలో 400లకు పైగా సీట్లను గెలుచుకుంటుందని అన్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూడబోతోన్నామని చెప్పారు.

మోదీ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల్లో చోటు చేసుకున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకే పట్టం కట్టబోతోన్నారంటూ ధీమా వ్యక్తం చేశారామె. తెలంగాణలోనూ కమలం వికసించబోతోందని పేరకొన్నారు. మెజారిటీ లోక్‌సభ నియోజవర్గాలను తాము గెలుచుకుంటామని జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+