Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటింటికీ ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

రాయ్‌పూర్: ఈ ఏడాది తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

We will provide up to 300 units of free electricity every month in Chhattisgarh, says Kejriwal

ఈ ఎన్నికలపై అటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. అధికారంలోకి రావడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌కే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ.. తన పరిధిని మరింత పెంచుకోవడానికి ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

ఈ క్రమంలో- ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇవ్వాళ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్‌పూర్ సహా పలు చోట్ల రోడ్ షోలను నిర్వహించారు. రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

We will provide up to 300 units of free electricity every month in Chhattisgarh, says Kejriwal

ఈ సభలో కీలక హామీలు ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఛత్తీస్‌గఢ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గృహావసర విద్యుత్ కనెక్షన్‌కూ 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని అన్నారు. ఒక్క రూపాయి కూడా బిల్లును వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

విద్యుత్ ఉత్పత్తిలో ఛత్తీస్‌గఢ్ మిగులు రాష్ట్రం అని, పొరుగు రాష్ట్రాలకు కావాల్సినంత కరెంట్‌ను విక్రయిస్తోందని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రంగంలో అగ్రగామిగా ఉంటోందని పేర్కొన్నారు. మిగులు విద్యుత్‌ను ప్రతి ఇంటికీ 24 గంటల పాటు ఉచితంగా అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. 24 గంటల పాటు ఉచితంగా ఎలా సరఫరా చేస్తారనే మేజిక్.. తనకు మాత్రమే తెలుసునని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+