బెంగాల్ లో మారుతున్న సీన్, అధికారం పక్కా వారిదే - తేల్చేసిన ప్రముఖ సర్వే..!!
పశ్చిమ బెంగాల్ లో గెలుపు ఎవరిది. పోలింగ్ తేదీలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఈ చర్చ ఆసక్తిని పెంచుతోంది. బెంగాల్ లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని మమత.. ఈ సారి కాషాయం జెండా ఎగుర వేయాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచే రెండు వైపులా రాజకీయంగా ఉద్రిక్తంగా మారింది. ఇక.. ప్రచారంలో ఇరు పక్షాలు హోరా హోరీగా తల పడుతున్నారు. అయితే, బెంగాల్ లో ప్రజలు ఎవరి వైపు... అధికారం ఎవరికి దక్కుతుందనే అంచనాలను ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ లో మమత వర్సస్ బీజేపీ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 2021 లోనే ఈ రెండు పక్షాల మధ్య రాజకీయ యుద్దం తారా స్థాయిలో జరిగింది. అప్పటి నుంచే 2026 ఎన్నిక లే లక్ష్యంగా రెండు వైపులా వ్యూహాలు అమలు చేసారు. మమతా తన పాలన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే ధీమాతో ఉన్నారు. అయితే, చొరబాట్లు.. ప్రభుత్వం పైన వ్యతిరేకత.. హిందుత్వ అజెండా తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. ప్రధాని మోదీ సహా ముఖ్య నేతలంతా బెంగాల్ లో ప్రచారం కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ తరువాత మమతకు అనుకూలంగా ఉన్న పలువురు అధికారులను బదిలీ చేసారు. కాగా.. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏంటనేది ప్రముఖ సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. గతం లో ఈ సంస్థ వెల్లడించిన అంచనాలకు తగినట్లుగా దాదాపుగా ఫలితాలు వెల్లడయ్యాయి.

భారీగా పెరగనున్న బీజేపీ సీట్లు.. గెలుపు మాత్రం
ఇక, ఈ సారి ఎన్నికల్లో హోరా హోరీ పోరు ఉన్నా... బెంగాల్ ఓటర్లు మమతకే పట్టం కట్టడం ఖాయమని ఈ సర్వే తేల్చేసింది. బెంగాల్ లో నాలుగు ప్రాంతాల లెక్కన ఈ సర్వే అన్ని వయసు .. వర్గాల వారీగా నిర్వహించింది. అందులో మమతకు చెందిన టీఎంసీ 15-165 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించింది. 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 146 మేజిక్ ఫిగర్. కాగా, బీజేపీకి 110-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 5-8, ఇతరులకు 4-6 వరకు వచ్చే అవకాశం ఉందని వివరించింది. మమత ద్వారానే పశ్చిమ బెంగాల్ గుర్తింపు కొనసాగుతుందని మెజార్టీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ప్రధాని మోదీ, అమిత్ షా మినహా స్థానిక నాయకత్వం పైన బెంగాల్ ప్రజల్లో ఆదరణ కనిపించటం లేదు. బీజేపీ లో ముఖ్య నేతల అంతర్గత కలహాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. దీంతో.. మరోసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడించింది.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!













Click it and Unblock the Notifications