పడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు.. ప్రధాని దిగ్భ్రాంతి
పశ్చిమ్ బెంగాల్ లో విషాదకరమైన ఘటన జరిగింది. బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన 15 మంది మత్య్యకారుల్లో 9 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ 9 మంది మృతదేహాలను బెంగాల్ లోని సౌత్ 24 పరాగణాస్ జిల్లా పోలీసులు వెలికి తీశారు. మృతులు ఒడిశా, బెంగాల్ వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
পশ্চিমবঙ্গের দক্ষিণ ২৪ পরগনা জেলায় নৌকাডুবিতে প্রাণহানির ঘটনা অত্যন্ত বেদনাদায়ক। শোকসন্তপ্ত পরিবারগুলিকে জানাই সমবেদনা। আহতদের দ্রুত আরোগ্য কামনা করি।
— PMO India (@PMOIndia) July 13, 2026
প্রধানমন্ত্রীর জাতীয় ত্রাণ তহবিল থেকে প্রত্যেক মৃতের নিকটাত্মীয়কে ২ লক্ষ টাকা অনুদান দেওয়া হবে। আহতদের দেওয়া হবে ৫০,০০০…
జూలై 2 న 15 మంది మత్స్య కారులు ఓ పడవలో పర్బా మేదినిపూర్ జిల్లాలోని దిగ సంకార్ పూర్ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు బయల్దేరారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రోజుల క్రితం ఆ పడవ గల్లంతైంది. అప్పటినుంచి ఆ పడవ ఆచూకీ తెలియలేదు. ఇదే విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. " ఆ పడవతో సంబంధాలు జూలై 5 న పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులపాటు నిరవధికంగా గాలింపు చర్యలు జరిగాయి. అలా చివరకు బక్కాలి కోస్ట్ దగ్గర బాగేర్ చర్ కు 35 కిలోమీటర్ల దూరంలో పడవను గుర్తించాం. అందులోనుంచి 9 మంది మృతదేహాలను వెలికి తీశాం. మిగతా ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నాం" అని తెలిపారు.

ఈ ఘటనపై ప్రధానిమంత్రి కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. వెస్ట్ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన కలచివేస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రధానమంత్రి నేషనల్ ఫండ్ నుంచి అందిస్తామని.. అలాగే గాయపడిన వారికి రూ. 50, 000 సహకారం అందిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications