ఫార్వార్డ్ మెసేజ్‌లపై పరిమితి విధించిన వాట్సాప్: నేటి నుంచే అమల్లోకి
Recommended Video

న్యూఢిల్లీ: తప్పుడు సమాచారం, అసత్య వార్తలు వ్యాప్తి కాకుండా కట్టడి చేసేందుకు ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో వాట్సాప్‌లో వస్తున్న వదంతుల వ్యాప్తి కారణంగా అమాయకులపై దాడులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కూడా వాట్సాప్‌ను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తప్పుడు వార్తలను అరికట్టేందుకు వాట్సాప్.. ఫార్వర్డ్ చేసే సందేశాలపై పరిమితి విధించింది. ఇందులో భాగంగానే ఇక నుంచి వాట్సాప్ మెసేజ్‌లు ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
బుధవారం(ఆగస్టు 8) నుంచి భారత్‌లో వాట్సాప్ వినియోగదారులకు ఇది వర్తించనుందని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

దీంతో పాటు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి అనే దాన్ని వాట్సాప్ ఆ వీడియోలో వివరించింది. ఇటువంటి వార్తలు నమ్మకుండా ప్రజల్లో ఎలా చైతన్యం తీసుకురావాలనే దాని గురించి ప్రస్తావించింది. ఎటువంటి సమయంలో ఫార్వర్డ్ సందేశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేసింది.
ఇప్పటి వరకు దాదాపు 20 మంది వ్యక్తులకు లేదా గ్రూపులకు ఒకేసారి ఫార్వర్డ్ మేసేజ్‌ను పంపించేందుకు సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని భారత్‌లో ఐదుకు మాత్రమే చేర్చింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతను తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని, అలాగే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తామని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications