ఇందిరా గాంధీ అప్పుడు నన్ను తిట్టారు: ప్రణబ్ ముఖర్జీ

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చెప్పినా వినకుండా 1980 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినందుకు ఆమెచే చివాట్లు తిన్నానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఆ ఎన్నికల్లో భోల్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రణబ్ 68,629 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. అయినా, మంత్రిమండలిలో ప్రణబ్‌కు చోటు దక్కడం గమనార్హం.

తాను ఓడిపోయిన తర్వాత ఇందిరా గాంధీ వద్దకు వెళ్లినప్పుడు ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారని ప్రణబ్ తెలిపారు. అంతేగాక చీవాట్లు పెట్టారని చెప్పారు. అప్పటికే ఇందిరా గాంధీ తన ఓటమి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సంజయ్ గాంధీ తనకు చెప్పారని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించడిందని కూడా ఆయనే చెప్పారని తెలిపారు.

When Pranab Mukherjee Got a 'Dressing Down' From Indira Gandhi

'ద డ్రమాటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ ఇయర్స్' పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ ఎన్నో ఆసక్తికర విషయాలు పొందుపర్చారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రణబ్ వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి. 1975లో అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలపై మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవగాహన లేదని పేర్కొన్నారు.

కేవలం పశ్చిమబెంగాల్ మాజీ సీఎం సిద్ధార్థ్ శంకరే సూచన మేరకే ఎమర్జెన్సీని విధించినట్టు చెప్పారు. ఎమర్జెన్సీ విషయంలో ఆయనే ముఖ్య భూమిక పోషించారని వెల్లడించారు. దానిపై తనకు అవగాహనలేదని ఇందిరాగాంధీ తరువాత తనకు చెప్పారన్నారు. ప్రధాని ఇందిరాగాంధీ సలహా మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మాద్ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్‌ను ఉపయోగిస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే దేశంలో పలువురు ముఖ్య ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. అరెస్టులను తప్పించుకోవడానికి చాలా మంది రాజకీయ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+