తమిళనాడులో పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతోంది...బీజేపీ ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయా..?
Recommended Video

తమిళ రాజకీయాల్లో ఇప్పటికి ముగ్గురి రాజకీయ ప్రస్థానం ముగిసింది. ఎమ్జీఆర్, జయలలిత, తాజాగా కరుణానిధి ప్రస్థానాలు ముగిశాయి. ఎమ్జీఆర్ మృతితో ఆ గ్యాప్‌ను జయలలిత పూడ్చగా... ఆమె మరణంతో మాత్రం అన్నాడీఎంకే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడూ స్థిరంగా ఉంటుందో... ఎప్పుడు పడిపోతుందో తెలియని మీమాంస నెలకొంది. ఇక కరుణానిధి మరణంతో డీఎంకేకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. స్టాలిన్ తండ్రి దగ్గర నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకున్నప్పటికీ పార్టీని ఎలా హ్యాండిల్ చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయనకు పక్కలో బళ్లెంలా అళగిరి ఉండనే ఉన్నాడు.
ఇదిలా ఉంటే తమిళ రాజకీయాల్లో మరో ఇద్దరు ప్రముఖ సినీ ప్రముఖులు ప్రవేశం చేశారు. వారే రజనీకాంత్, కమల్ హాసన్. కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళుతుండగా... మరో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి ఇప్పటివరకూ దాని పేరు కానీ విధివిధానాలు కానీ ప్రకటించలేదు. అమ్మ మృతితో ఆ పార్టీలో లుకలుకలు ఏర్పడటంతో పెద్ద దిక్కుగా నిలిచి అక్కడ పాగా వేయాలని భావించింది బీజేపీ. అయితే బీజేపీ నుంచి పెద్దగా ప్రజాకర్షనాయకుడు లేకపోవడంతో ఆ ఆలోచన బెడిసి కొట్టింది. ఇదే సమయంలో రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ కాస్త ఆశపెట్టుకుంది. రజనీకాంత్ స్వతహాగా ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి. అతన్ని అన్నాడీఎంకేలో చేర్పించి కానీ, అన్నాడీఎంకేతో పొత్తుతో కాని వెళ్లి ఒక రూపునివ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రజనీకాంత్ పార్టీ పేరు ప్రకటన చేసేందుకు మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక అన్నాడీఎంకే విషయానికొస్తే సీఎం ఈపీఎస్ డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లు కలిసి పనిచేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీలో రెండు గ్రూపులున్నాయనేది బహిరంగ రహస్యం. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో పన్నీర్ సెల్వంకు దగ్గర సంబంధాలున్నాయి కాబట్టి... రేపు బీజేపీకి దగ్గరైతే పార్టీ బలహీనపడే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో మన్నార్‌గుడి బ్యాచ్‌కు చెందిన శశికళ, కొత్తగా పార్టీపెట్టిన టీటీవీ దినకరన్ మాతృపార్టీ అన్నాడీఎంకేను చీల్చి వీరు బలపడే అవకాశం ఉంది.
ఇక గతేడాది జనవరిలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కరుణానిధి తన మూడో కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించాడు. 1973 నుంచే స్టాలిన్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. 1984 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఆస్తులతో సంబంధాలున్న స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాలిన్ కాస్త చాకచక్యంగా వ్యవహరించి పార్టీని నడపగలిగితే తిరిగి డీఎంకేను అధికారంలోకి తీసుకువచ్చే సత్తా స్టాలిన్‌కుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, ఇతర చిన్నా చితకా పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తే స్టాలిన్ బలమైన నాయకుడుగా ఎదుగుతారని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో డీఎంకే పార్టీ మాత్రమే ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొనగలదని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications