Chandrayaan-3: రష్యాకు ఒకటిన్నర రోజు.. అమెరికాకు 4 రోజులు.. భారత్‍కు 40 రోజులు ఎందుకు..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక్కో అడుగు వేసుకుంటూ.. విజయం సాధిస్తూ వెళ్తోంది. చంద్రుడి పై భారత రోవర్ ను దించడానికి తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగం చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడిపై ల్యాండ్ చేయనున్నారు. అయితే ఈ ప్రయోగానికి 40 రోజుల సమయం పట్టనుంది. మిగతా దేశాలు వారం రోజుల్లోనే చంద్రుడిని చేరుకున్నాయి. మరి భారత్ కు ఎందుకంతా టైమ్ పడుతుందంటే..
భూమి నుంచి చంద్రుడు 3.84 కిలో మీటర్ల దూరంలో ఉంటాడు. అమెరికా 1969 జులై 16న ప్రయోగించిన అపోలో 11 చంద్రుడి పైకి వెళ్లడానికి నాలుగు రోజుల సమయం పట్టింది. ఇక రష్యా ఒకటిన్నర రోజులోనే చంద్రుడి పైకి లూనా-2 వ్యోమనౌక ను పంపింది. మరి భారత్ కు 40 రోజులు పట్టడానికి ప్రధాన కారణం శక్తివంతమైన రాకెట్లు లేకపోవడం. శక్తివంతమైన రాకెట్లు తయారు చేయాలంటే భారీ స్థాయిలో ఖర్చు అవుతుంది. అందుకే ఇస్రో తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 ప్రయోగం చేసింది.

అమెరికా, రష్యాల వారి ప్రయోగాలకు వేల కోట్లు ఖర్చు పెడితే ఇస్రో మాత్రం రూ.615 కోట్లతో చంద్రయాన్ 3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగంలో ఇస్రో.. భూ గురుత్వాకర్షణ శక్తితో చంద్రుడిపై పయనించే మార్గాన్ని అనుసరిస్తోంది. చంద్రయాన్ 3 రాకెట్ భూమి చుట్టూ 170x36,500 కిలోమీటర్ల్ దీర్ఘవృత్తాకర కక్ష్యాలో ప్రవేశపెట్టారు. ఇది భూమి చుట్టూ 24 రోజులు పాటు దిగురుతూ క్రమంగా దూరంగా వెళ్తూ చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్తోంది. ఇందుకు 40 రోజలు సమయం పట్టనుంది.
ఆగస్ట్ 23 చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేయనున్నారు. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై దిగనుంది. చంద్రుని ఉపరితలంపై రోవర్ కేవలం డేటాను సేకరించడం కాకుండా.. ప్రజ్ఞాన్ అని పిలువబడే రోవర్ వెనుక చక్రాలు ISRO, జాతీయ చిహ్నం గుర్తులను చంద్రుడి ఉపరితలం ముద్రిస్తాయి.సూర్య రశ్మి ఉన్న చోటే ల్యాండ్ చేయనున్నారు. ఎందుకంటే రోవర్ కు సోలార్ ప్యానల్ అమార్చరు. సూర్య రశ్మి ఉన్న చోట రోవర్ ల్యాండ్ చేయడం వల్ల సోలార్ ప్యానల్ ద్వారా రోవర్ పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications