Wife: అర్దరాత్రి రైల్వేస్టేషన్ లో యువకుడు ?, పోలీసులు ఎంట్రీ, నా భార్యను చంపేసి చెక్కేస్తున్నానని చెప్పి !
ముంబాయి: భార్యతో కలిసి కాపురం చేస్తున్న భర్త కొంతకాలం సంతోషంగా ఉన్నాడు. భార్యను పదేపదే చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త ఆమెతో ఎక్కువగా గొడవపడేవాడు. దంపతుల మద్య రాజీ చెయ్యాలని కుటుంబ సభ్యులు అనేకసార్లు ప్రయత్నించారు. అయితే నేను మోనార్క్ నేను ఎవ్వరి మాట వినను అని భర్త రెచ్చిపోవడం మొదలు పెట్టాడు. ఇప్పటికే భార్య దెబ్బతో జైలుకు వెళ్లిన భర్త బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన భర్త మళ్లీ అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. అర్దరాత్రి రైల్వేస్టేషన్ లో ఓ రైలు ఎక్కిన భర్త అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని రైల్వే పోలీసులు గమనించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేసి షాక్ అయ్యారు. కొన్ని గంటల ముందు తన భార్యను గొంతు కోసి చంపేశానని ఆ వ్యక్తి చెప్పడంతో రైల్వే పోలీసులు హడలిపోయారు.

మైనర్ తో పెళ్లి
ముంబాయిలోని అంధేరిలోని డీఎన్ నగర్ లో హాసన్ పఠాన్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అత్తరున్నిసా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని హాసన్ పఠాన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొత్తలో హాసన్ పఠాన్ అతని భార్యతో కలిసి కాపురం చేస్తూ కొంతకాలం సంతోషంగా ఉన్నాడు.

రెచ్చిపోయిన మొగుడు
రానురాను హాసన్ పఠాన్ అతని భార్యను పదేపదే చిత్రహింసలకు గురి చేశాడు, హాసన్ పఠాన్, అత్తరున్నిసా దంపతుల ఎక్కువగా గొడవు జరిగాయి. హాసన్ పఠాన్ దంపతుల మద్య రాజీ చెయ్యాలని కుటుంబ సభ్యులు అనేకసార్లు ప్రయత్నించారు. అయితే నేను మోనార్క్ నేను ఎవ్వరి మాట వినను అని హాసన్ పఠాన్ ఇంకా ఇంకా రెచ్చిపోవడం మొదలు పెట్టాడు.

జైలుకు పంపించిన పోలీసులు
హాసన్ పఠాన్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని భార్య కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. మైనర్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెను హాసన్ పఠాన్ చిత్రహింసలకు గురి చేస్తున్నారని కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇప్పటికే భార్య దెబ్బతో జైలుకు వెళ్లిన హాసన్ పఠాన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన హాసన్ పఠాన్ మళ్లీ అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. హాసన్ పఠాన్ భార్యకు ఇప్పుడు 20 ఏళ్లు.

అర్దరాత్రి రైలులో చిక్కిపోయాడు
ముంబాయిలోని మానససరోవర్ రైల్వేస్టేషన్ లో అర్దరాత్రి పన్వేల్ రైలు ఎక్కిన హాసన్ పఠాన్ లగేజ్ కంపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని రైల్వే పోలీసులు గమనించారు. కొంతసేపటి తరువాత హాసన్ పఠాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేశారు. కొన్ని గంటల ముందు ఇంట్లో తన భార్యను గొంతు కోసి చంపేశానని హాసన్ పఠాన్ చెప్పడంతో రైల్వే పోలీసులు హడలిపోయారు. చాలా కాలంగా హాసన్ పఠాన్ అతని భార్యతో గొడవలు పడుతున్నాడని, పదేపదే ఆమెను చంపేస్తానని బెదిరించేవాడని, చివరికి నిజంగానే భార్యను దారుణంగా చంపేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు.

భార్యతో తేడాలు వచ్చాయని చంపేశాడు
హాసన్ పఠాన్ ఇచ్చిన సమాచారం మేరకు అంధేరిలోని డీఎన్ నగర్ లోని అతని ఇంట్లో అతని భార్య శవాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు. భార్యతో తేడాలు రావడంతోనే ఆమెను చంపేశానని హాసన్ పఠాన్ అంగీకరించాడని నేవి ముంబాయి పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications