భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, రాత్రి భర్తను మంచానికి కట్టేసి ఐదు ముక్కలుగా నరికేసిన భార్య !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన భర్తను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపింది. పోలీసుల విచారణలో భార్య ఆ మ్యాటర్ ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. నిద్రిస్తున్న భర్త అటు ఇటు కదలకుండా అతన్ని మంచానికి గట్టిగా తాళ్లతో కట్టేసి గొడ్డలితో నరికి చంపేసింది. తరువాత భర్త మృతదేహాన్ని ఐదు ముక్కలుగా కట్టుకున్న భార్య నరికేసింది.
భర్త శరీరంలోని భాగాలను అతని భార్య సీక్రేట్ గా ఇంటి నుంచి తీసుకెళ్లి స్థానిక కాలువలోకి విసిరిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్‌లో చోటుచేసుకుంది. గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన రామ్‌పాల్ (55) హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు. . రామ్ పాల్ కుమారుడు, సోన్ పాల్, తన తండ్రి కనిపించడం లేదని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్ పాల్ అతని భార్య, పిల్లలతో నివసించాడు.

సోమవారం రాత్రి నుంచి తన తండ్రి రామ్ పాల్ కనిపించకపోవడంలేదని అతని కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల విచారణలో రామ్ పాల్ భార్య దేవి అక్రమ సంబంధం గురించి, ఇప్పటికే ఆమె ఇంటి నుంచి పారిపోయిందని వెలుగు చూసింది. అనుమానం వచ్చిన పోలీసులు దులారో దేవిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రామ్ పాల్ భార్య దేవి హత్య చేసినట్లు నేరం అంగీకరించిందని పోలీసులు అన్నారు. సోమవారం రాత్రి నిద్రిస్తున్న రామ్‌పాల్‌ను మంచానికి కట్టేసి గొడ్డలితో అతన్ని హత్య చేసినట్లు దేవి పోలీసులకు చెప్పింది. తరువాత తన భర్త రామ్ పాల్ శవాన్ని ఐదు ముక్కలుగా నరికి సమీపంలోని పెద్ద కాలువలో అక్కడక్క విసిరేశానని దేవి చెప్పిందని పోలీసులు అన్నారు. రాంపా పాల్ శరీర భాగాలను వెలికి తీయడానికి పోలీసుల పారిశుద్ద కార్మికుల సహాయం కోరుతున్నారని తెలిసింది.

కాలువలో రక్తసిక్తమైన రామ్ పాల్ బట్టలు, అతను ఉపయోగించే మంచం కనిపించాయని పోలీసులు అన్నారు. స్థానిక మార్కెట్‌కు వెళ్లిన పోలీసులు అక్కడా విచారణ చేపట్టారు. ఇటీవల భర్త రామ్ పాల్ తో కలిసి మార్కెట్‌కు వెళ్లిన దేవి గొడ్డలికి పదును పెట్టించిందని తెలిసింది. అయితే తనను చంపేందుకు తన భర్త దేవి గొడ్డలికి పదును పెట్టిస్తోందని రామ్ పాల్ కు తెలియదని, అతను ఊహించలేకపోయాడని పోలీసులు అన్నారు.
పోలీసులు స్థానికులను విచారించగా దేవికి ఆమె భర్త రామ్ పాల్ స్నేహితుడితోనే అక్రమ సంబంధం ఉందని, మూడు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని, దేవికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఇంట్లో అప్పటి వరకు ఎవరికీ తెలీదని, తరువాత దేవి కోసం గాలించి వారం రోజుల క్రితమే ఆమెను పట్టుకుని ఇంటికి తీసుకు వచ్చారని స్థానికులు పోలీసులకు చెప్పారు. అయితే దేవి కుటుంబ సభ్యులు, బంధువులు మాకు ఏమీ తెలీదు అంటూ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications