Wife: భార్య హత్య కేసులో జైల్లో భర్త, కొత్త ఆధార్ కార్డుతో భార్య రెండో పెళ్లి, రెండో మొగుడితో తిరుగుతూ !
లక్నో/ ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల మద్య ఎలాంటి గొడవలు లేవని ఇరువైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు. భర్త బయట పనిమీద బయటకు వెళ్లిన సమయంలో భార్య ఎక్కువగా బయట తిరిగింది. బయటకు వెళ్లిన భార్య కనపడకుండా పోయింది. కొంతకాలం తరువాత నా కూతురిని తన అల్లుడు హత్య చేశాడని మహిళ తండ్రి కేసు పెట్టాడు. ఓ మహిళ శవం గుర్తించిన పోలీసులు విచారణ చేశారు. శవం నా కూతురిదే అని మాయం అయిన మహిళ తండ్రి నిర్దారించాడు. పోలీసులకు రివార్డు వచ్చింది. మహిళను ఆమె భర్త హత్య చేశాడని, అతనికి స్నేహితుడు సహకరించాడని ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. భర్త, అతని ఫ్రెండ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు సంవత్సరాల తరువాత హత్యకు గురైయ్యిందని అందరూ అనుకున్న భార్య మరో వ్యక్తితో కలిసి హ్యాపీగా తిరుగుతోందని వెలుగు చూడటం కలకలం రేపింది.

రాజస్థాన్ బార్డర్ లో పరిచయం
రాజస్థాన్ లోని కరౌలి-దోసా జిల్లా సరిహద్దులోని గ్రామంలో సూరజ్ ప్రకాష్ గుప్తా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రకాష్ గుప్తా కుమార్తె ఆర్తీదేవి (28).ఉత్తరప్రదేశ్ లో సోనూ సైనీ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2015లో ఆర్తీ దేవి. సోనూ సైనీకి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరూ టచ్ లో ఉన్నారు.

తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది
కొంతకాలానికే ఆర్తీ దేవి, సోనూ సైనీ ప్రేమించుకున్నారు. 2015 చివరిలో ఆర్తీ దేవి ఆమె తండ్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రియుడు సోనూ సైనీని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని వైందావన్ లో వివాహం చేసుకున్న సోనూ సైనీ, ఆర్తీ దేవి దంపతులు అదే ప్రాంతంలో నివాసం ఉంటూ సంతోషంగా కాపురం చేశారు. సోనూ సైనీ, ఆర్తీ దంపతుల మద్య ఎలాంటి గొడవలు లేవని అందరూ అనుకున్నారు.

మాయం అయిన మహిళ
సోనూ సైనీ బయట పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య ఆర్తీ దేవి ఎక్కువగా బయట తిరిగింది. 2016లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆర్తీ దేవి కనపడకుండా పోయింది. కొంతకాలం తరువాత నా కూతురు ఆర్తీ దేవిని తన అల్లుడు సోనూ సైనీ హత్య చేశాడని మహిళ తండ్రి ప్రకాష్ గుప్తా వైందావన్ లో పోలీసు కేసు పెట్టాడు.

జైలుకు వెళ్లిన భర్త
ఆర్తీ దేవి కనపడటం లేదని కేసు విచారణ చేసిన పోలీసులు ఓ మహిళ శవం గుర్తించారు. ఆ శవం తన కూతురు ఆర్తీ దేవిది అని ఆమె తండ్రి ప్రకాష్ గుప్తా నిర్దారించారు. ఆర్తీ దేవిని ఆమె భర్త సోనూ సైనీ హత్య చేశాడని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆర్తీ దేవిని హత్య చెయ్యడానికి సోనూ సైనీకి అతని ఫ్రెండ్ గోపాల్ సైనీ (30) సహకరించాడని అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులకు రివార్డు....... జైల్లో భర్త
ఆర్తీ దేవి హత్య చేసును చాకచక్యంగా చేధించారని పోలీసు అధికారులు సోనీ సైనీని అరెస్టు చేసిన పోలీసులకు రూ. 15 వేలు రివార్డు అందించారు. ఆర్తీ దేవి హత్యకు గురైయ్యిందని అందరూ అనుకున్నారు. ఆర్తీ దేవి భర్త సోనూ సైనీ 18 నెలలు జైలు శిక్ష అనుభవించారు. సోనీ సైనీ ఫ్రెండ్ గోపాల్ సైనీ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.

రెండో భర్తతో ఎంజాయ్
బెయిల్ మీద బయటకు వచ్చిన సోనీ సైనీ, అతని స్నేహితుడు గోపాల్ సైనీ ఆర్తీ దేవి కోసం ఆరు సంవత్సరాల నుంచి గాలిస్తూనే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లోని మధురా ఏరియాలో రెండో పెళ్లి చేసుకున్న ఆర్తీ దేవి ఆమె రెండో భర్తతో జల్సాగా తిరుగుతూ ఆమె మొదటి భర్త సోనీ సైనీ కంటపడింది. సోనీ సైనీ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆర్తీ దేవిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్తీ దేవి తప్పుడు పుట్టిన రోజు తేదీతో మరో ఆధార్ కార్డు కూడా తీసుకుందని పోలీసులు గుర్తించారు.

నాలుక కరుచుకున్న పోలీసులు
భార్య హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన భర్త అదే భార్యను మరో వ్యక్తితో చూసి షాక్ అయ్యాడు. ధరిద్రం ఏమిటంటే ఆమె నిజంగానే హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు కూడా డిసైడ్ అయిపోయి పోలీసులకు రివార్డు ఇవ్వడమే కాకుండా కోర్టులో సాక్షాలు సమర్పించి ఇప్పుడు నాలిక కోరుక్కుంటున్నారు.












Click it and Unblock the Notifications