వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ పైశాచికం: కులభూషణ్ జాదవ్ మృతదేహాన్ని పంపిస్తామంటూ మెసేజ్

పాకిస్థాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. అఖిల భారత ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) అధికారిక వెబ్‌సైట్‌ హ్యాక్ చేసింది. ‘జీరో కూల్‌’ అనే పేరుతో వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి..

|
Google Oneindia TeluguNews

న్యూల్లీ: పాకిస్థాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. అఖిల భారత ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) అధికారిక వెబ్‌సైట్‌ హ్యాక్ చేసింది. 'జీరో కూల్‌' అనే పేరుతో వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి.. భారత్‌ను రెచ్చగొట్టేలా కులభూషణ్‌ జాదవ్‌పై మెసేజ్‌ పెట్టారు పాక్ హ్యాకర్లు

'జాదవ్‌ మృతదేహాన్ని త్వరలోనే మీకు పంపిస్తాం' అంటూ ఆ మెసేజ్‌ పోస్టు చేశారు. అయితే వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌పై ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. అప్రమత్తమైన ఏఐఎఫ్‌ఎఫ్‌ వెంటనే తమ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్య వల్ల నెటిజన్లకు కలిగిన అసౌకర్యానికి గానూ.. ట్విట్టర్‌ ద్వారా క్షమాపణలు తెలిపింది.

అయితే జాదవ్‌పై హ్యాకర్లు పెట్టిన మెసేజ్‌ గురించి మాత్రం ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అంతేగాక, భారతీయులకు స్నాప్‌డీల్‌కు, స్నాప్‌ఛాట్‌కు తేడా కూడా తెలియదని హ్యాకర్‌ మెసేజ్‌లో ఉంది.

గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాక్‌ మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ శిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది.

English summary
A group of hackers, who call themselves Zero Cool, on Tuesday hacked the All India Football Federation's (AIFF) website and posted a derrogatory message about India's outrage over Kulbhushan Jadhav's death sentence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X