మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం
భోపాల్: ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని హోటల్ కు పిలుచుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేసి మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసు శాఖలోనే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పోలీస్ హెడ్ క్వాటర్స్ లో కాశీరాం అనే వ్యక్తి స్టెనో గ్రాఫర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే 25 సంవత్సరాల యువతి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. మూడు సంవత్సరాల నుండి ఇద్దరికి పరిచయం ఉంది.

కాశీరాం తనను ప్రేమించాడని, వివాహం చేసుకుంటానని నమ్మించాడని మహిళా కానిస్టేబుల్ ఆరోపిస్తున్నది. తరువాత తనను నమ్మించి ఉజ్జయిని లోని ఒక హోటల్ కు తీసుకు వెళ్లి అక్కడే అత్యాచారం చేశాడని ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
కాశీరాంకు గతంలోనే వివాహం అయ్యిందని, ఆ విషయం మహిళా కానిస్టేబుల్ దగ్గర దాచి పెట్టాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు ఒకే శాఖలో ఉద్యోగం చేస్తుండటంతో పోలీసు అధికారులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications