విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన 'కరూర్' బాధితురాలు.. రూ. 20 లక్షలు వెనక్కి
తమిళగ వెట్రి కజగం(TVK) అధినేత విజయ్ కు కరూర్ తొక్కిసలాట ఘటన బాధితురాలు బిగ్ షాక్ ఇచ్చారు. తొక్కిసలాటలో తన భర్త మృతిచెందినందుకు విజయ్ ఇచ్చిన రూ. 20 లక్షల పరిహారాన్ని ఆమె తిరిగి ఇచ్చేశారు. విజయ్ కరూర్ లోని తమ వద్దకు రాలేదని.. మామల్లపురంలోని ఓ రిసార్ట్ కు బాధితులను పిలిపించుకుని ఓదార్చడాన్ని ఆమె తప్పుబట్టారు. అందుకే తాను పరిహారాన్ని వెనక్కు ఇస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27 న కరూల్ లో విజయ్ నిర్వహించిన పొలిటికల్ ర్యాలీకి లక్షలాది మంది కార్యకర్తలు, ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబర్ 27 న కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత అక్టోబర్ 27న తమిళగ వెట్రి కజగం(TVK) అధినేత విజయ్.. బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. తొక్కిసలాట జరిగిన కరూర్ కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురంలోని ఓ రిసార్ట్ కు ఐదు బస్సుల్లో బాధిత కుటుంబాలను తరలించారు టీవీకే నేతలు. ఈ రిసార్ట్ లో దాదాపు 50 రూమ్స్ బుకింగ్ చేశారు. అక్టోబర్ 27 సోమవారం రోజున కరూర్ బాధిత కుటుంబాలను విజయ్ కలిశారు. ఒక్కో కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. ఈ సమావేశం దాదాపు 8 గంటలకు పైగా జరిగింది.
అయితే అంతకుముందు కరూర్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు విజయ్ పరిహారం ప్రకటించారు. 41 కుటుంబాలను వీడియో కాల్ ద్వారా పరామర్శించి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షల చొప్పున నగదు బదిలీ చేశారు. అయితే కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో శాంకవి పెరుమాల్ అనే మహిళ భర్త కూడా ఉన్నాడు. అయితే పరిహారం కింద ఆమెకు అందిన రూ. 20 లక్షల నగదును ఆమె తిరిగి ఇచ్చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. కరూర్ కు వచ్చి నివాళులు అర్పించలేదని అందువల్ల ఈ పరిహారాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు శాంకవి తెలిపారు. బాధిత కుటుంబాలను మామల్లపురంలోని ఓ రిసార్ట్ లో పరామర్శించడాన్ని ఆమె వ్యతిరేకించారు.
అయితే ఈ తొక్కిసలాట ఘటన కరూర్ లో జరగ్గా.. బాధిత కుటుంబాలను కలిసేందుకు విజయ్ మామల్లపురంను ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా తాను కరూర్ కు రాలేకపోతున్నానని.. పరిస్థితులు సద్దుమణిగాక కరూర్ వచ్చి బాధిత కుటుంబాలను కలుస్తానన్నారు. అయితే బాధిత కుటుంబాలను టీవీకే నేతలు కరూర్ కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురంలోని ఓ రిసార్ట్ కు తరలించారు. అక్కడే విజయ్.. ఆ ఫ్యామిలీస్ తో మాట్లాడారు.

దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. విజయ్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరూర్ వెళ్లాల్సిన విజయ్.. వారినే ఇక్కడకు పిలిపించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్న టీవీకే పార్టీకి ఇది పెద్ద మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications