నల్లగా ఉన్నాడని కిరోసిన్ పోసి భర్తకు నిప్పుపెట్టిన భార్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలోని మాధవ్‌గంజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్త నల్లగా ఉన్నాడని.. తనకు విలాసవంతమైన జీవితాన్ని అందివ్వలేదని ఆగ్రహంతో ఓ మహిళ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసింది. ఈ దారుణం మంగళవారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితురాలు ఛమేలి, ఆమె భర్త జాగ్రమ్ రాథోడ్ మాధవగంజ్‌లో నివాసం ఉంటున్నాన్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, మంగళవారం జాగ్రమ్ రాథోడ్ మంచంపై నిద్రిస్తున్న సమయంలో అతన్ని మంచానికి కట్టేసిన ఛమేలి, ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో అతడు మంటల్లో కాలిపోయాడు.

రాథోడ్ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జాగ్రమ్ తీవ్ర గాయాలతో తనువు చాలించాడు. కాగా, భర్తకు నిప్పంటించిన ఛమేలి వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితురాలు ఛమేలిని అరెస్ట్ చేశారు. అయితే తాను తన భర్తను హత్య చేయలేదని, తనకు ఏమి తెలియదని ఛమేలి పోలీసులకు చెప్పింది. తన అత్తగారి కుటుంబం వారు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. కాగా, ఛమేలి ఎప్పుడూ తనకు విలాసవంతమైన సౌకర్యాలు కావాలని తన అన్నయ్యను ఇబ్బందులు పెట్టేదని రాథోడ్ సోదరి గిరిజా దేవి పోలీసులకు చెప్పింది. తన అన్నయ్య కూలీగా పని చేసేవాడని, అతను ఛమేలికి విలాసవంతమైన సౌకర్యాలు ఏ విధంగా కల్పించగలడని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications