మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్.. ఏకంగా 90 లక్షల మందికి ఆ పథకం కట్
దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పలు హామీలను గుప్పిస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లాంటి పథకాలు ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ నేపథ్యంలో ఇప్పటి నుంచే మహిళా ఓటర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని మహిళలకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని 'మాఝీ లడ్కీ బహిన్ యోజన' పథకం నుంచి ఏకంగా 90 లక్షలకు పైగా మహిళలను తొలగించింది అక్కడి ప్రభుత్వం. దీనికి ప్రధాన కారణం ఈ- కేవైసీ పూర్తి చేయకపోవడమే అని తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 లక్షల మంది మహిళల్ని ఈ పథకం నుంచి తొలగించారు. తొలుత ఈ పథకానికి 2.34 కోట్ల మంది మహిళలు అర్హులు కాగా ఇప్పుడు ఆ సంఖ్యలో 38 శాతం మంది తగ్గినట్లు తెలుస్తోంది. అయితే మహిళల తొలగింపునకు ప్రధాన కారణం ఈ- కేవైసీ పూర్తి చేయకపోవడమే అని సమాచారం. అలాగే అర్హత లేకపోవడమూ ఓ కారణంగా తెలుస్తోంది.
ఈ కేవైసీని సకాలంలో పూర్తి చేయలేని కారణంగా దాదాపు 50 నుంచి 55 లక్షల మంది మహిళల్ని తొలగించారు అధికారులు. అలాగే వార్షిక కుటుంబ ఆదాయం రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఉన్న మహిళలు ఈ పథకానికి అనర్హులుగా ఉన్నారు. మరోవైపు 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 4.5 లక్షల మంది మహిళలు కూడా ఈ పథకానికి అనర్హులుగా మిగిలారు. అలాగే ఈ పథకానికి తాము కూడా అర్హులమే అని దరఖాస్తు చేసుకున్న 14 వేల మంది పురుషులను తొలగించారు.

అధికసంఖ్యలో 28 లక్షల మంది మహిళలను బీడ్ జిల్లా నుంచి తొలగించారు. ఇదే విషయంపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఈ పథకానికి సంబంధించి కేవైసీ పూర్తి కోసం మహిళలకు 8 నెలలు సమయం ఇచ్చాం. కానీ వాళ్లు పూర్తి చేయని కారణంగా తొలగించాల్సి వచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications