సీఎంకు వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం, ఈ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే, చచ్చినా ఒక్కటే
బెంగళూరు: కర్ణాటకలో విద్యుత్ కోతలు ఎక్కువ అయ్యాయని. పరిశ్రమల సమస్యలపై కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సిద్దరామయ్య ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు లక్షలాది మంది జీవితాలు ఇస్తున్నాయని, అలాంటి పరిశ్రమల మీద చిన్నచూపుచూస్తే ఆ కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు.
బెంగళూరు సమీపంలోని తుమకూరు జిల్లాలో వందలాది ఫ్యాక్టరీు, పరిశ్రమల్లో వేలాది మంది ప్రజలు ఉద్యోగాలు చేస్తూ వారి కుటుంబాలను పోషిస్తున్నారని, అలాంటి జిల్లాలోని పరిశ్రమలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చెయ్యకుండా సిద్దరామయ్య ప్రభుత్వం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప ఆరోపించారు.

పలు జిల్లాల్లో పరిశ్రమలకు, చిన్నపాటి ఫ్యాక్టరీలకు సిద్దరామయ్య ప్రభుత్వం విద్యుత్ సరఫరా చెయ్యడంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు మూసివేయడానికి వాటి యాజమాన్యం సిద్దం అవుతోందని యడియూరప్ప ఆరోపించారు. తుమకూరు జిల్లాలోని ఇండస్ట్రియల్ ఏరియా పరిసర ప్రాంతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా తాగునీరు కూడా సరఫరా చెయ్యడం లేదని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మండిపడ్డారు.
తుమకూరు జిల్లాలో ఇద్దరు మంత్రులుగా పనిచేస్తున్నారని, పరిశ్రమల యాజమాన్యం ఆందోళనలు చేస్తున్నా ఆ ఇద్దరు మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఇద్దరు మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులు, ఫ్యాక్టరీల యజమానుల సమస్యలు అడిగి తెలుసుకోవడంలో ఇద్దరు మంత్రులు విఫలం అయ్యారని యడియూరప్ప ఆరోపించారు.

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం బతికి ఉన్నట్లు కనిపించినా ఈ ప్రభుత్వం చచ్చినట్లే అంటూ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చెయ్యకపోతే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీఎస్ యడియూరప్ప సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హోచ్చరించారు.












Click it and Unblock the Notifications