ప్రేమించాలని బస్సు డ్రైవర్ టార్చర్, ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ విద్యార్థిని !
ప్రేమించాలని బస్సు కండెక్టర్ వేధింపులకు గురి చెయ్యడంతో జీవితంపై విరక్తి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థిని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపుర తాలుకా ఆదరగరెలో
బెంగళూరు: ప్రేమించాలని బస్సు కండెక్టర్ వేధింపులకు గురి చెయ్యడంతో జీవితంపై విరక్తి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థిని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపుర తాలుకా ఆదరగరెలో జరిగింది.
ఆదరగెరెలో నివాసం ఉంటున్న తనుశ్రీ (19) సకలేశపురలోని లా కాలేజ్ లో న్యాయ శాస్త్రం విద్యాభ్యాసం చేస్తున్నది. ప్రతి రోజు ఇంటి నుంచి సకలేశపురకు బస్సులో వెళ్లి కాలేజ్ లో చదువుతోంది. బస్సు డ్రైవర్ సంతోష్ తనుశ్రీకి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతను తనను ప్రేమించాలని వేధింపులకు గురి చేశాడు.

ఈనెల 3వ తేదీన సంతోష్ తనుశ్రీ మొబైల్ కు ఐలవ్ యూ అంటు మెసేజ్ పెట్టాడు. నువ్వు నన్ను ప్రేమించకుంటే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి డెత్ నోట్ లో నీ పేరు రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ విషయంలో భయపడిన తనుశ్రీ ఆమె పురుగుల మందు తాగింది. ఆ రోజు నుంచి ఆసుపత్రిలో ఉన్న తనుశ్రీ శనివారం చికిత్స విఫలమై మరణించిందని పోలీసులు చెప్పారు. ఆదరగెరె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications