రంజాన్ పర్వదినాన కశ్మీర్‌లో అల్లర్లు...ఒకరు మృతి
కశ్మీర్ మరో సారి అట్టుడికింది. అనంతనాగ్ పట్టణంలో రంజాన్ పండగ సందర్భంగా ప్రార్థనలు ముగిశాక స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ ఘర్షణలో ఓ 20 ఏళ్ల కుర్రాడు మృతి చెందాడు. మరో 10 మందికి గాయాలయ్యాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పుల్వామాలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందడంపై ఆందోళనకారులు అనంతనాగ్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అది కాస్త ఉద్రిక్తత పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు అలర్ట్ అయి గుంపును చెదరగొట్టేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే షిరాజ్ అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదిలా ఉంటే రంజాన్ సందర్భంగా పోలీసుల భద్రతా దళాలు కొన్ని రోజులుగా అని ఆపరేషన్స్‌కు విరామం ప్రకటించాయి.

మరోవైపు షోపియన్ ప్రాంతంలో కూడా కొందరు ఆందోళనకారులు భద్రతాదళాపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. శ్రీనగర్‌లోని మసీదులో ప్రార్థనల సమయంలో ఈ అల్లర్లు చోటుచేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications