రోహతక్ అక్కాచెల్లెళ్ల మార్ఫింగ్ ఫోటోలు నెట్లో పెట్టాడు, అరెస్ట్

చండీగఢ్: రోహతక్ అక్కాచెల్లెళ్లు మరోసారి వార్తల్లోకి వచ్చారు! తమను యువకులు వేధించారంటూ వారు ఓసారి బస్సులో, మరోసారి పార్కులో యువకుడికి బుద్ధి చెప్పారు. ఆ వీడియోలు వివాదాస్పదమయ్యాయి కూడా. తాజాగా.. తమ చిత్రాలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి కొందరు ఫేస్‌బుక్‌లో పెడుతున్నారని వారు ఆరోపించారు.

వారు ఈ ఆరోపణలు చేస్తూ ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గతంలో తమన వేధించి జైలుకెళ్లిన ఓ యువకుడు కోర్టు బయట రాజీపడదామని ఒత్తిడి తెస్తున్నాడని, తాము అంగీకరించకపోవడంతో ఈ పని చేస్తున్నాడని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Rohtak Sisters

ఈ నేపథ్యంలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. నిందితుడి పేరు నితిన్ కుమార్. అతను దరోథా గ్రామవాసి. రోహతక్ అక్కాచెల్లెళ్ల మార్ఫింగ్ ఫోటోలను నెట్లో పెడుతున్న ఆరోపణలపై అతనిని అరెస్టు చేసిన పోలీసులు.. విచారించారు.

స్థానిక న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనని అదుపులోకి తీసుకొని విచారించారు. సివిల్ లైన్స్ పోలీసు ఇంఛార్జ్ విచారణ చేశారు. రోహతక్ అక్కాచెల్లెళ్లు శనివారం నాడు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారని, దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+