ఆటలో మునిగాడు .. మంచినీరనుకొని యాసిడ్ తాగాడు .. మధ్యప్రదేశ్ లో కలకలం
భోపాల్ : సరదాగా కాసేపు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం చేసే ఆడేది ఆట. కాలం మారుతోన్న ఆన్ లైన్ గేమ్స్ వచ్చాయి. ఈ ఆటలో మునుగుతున్న యువత .. తమ గురించి తాము మరచిపోతున్నారు. ఆటలో లీనమై .. తాము ఏం చేస్తున్నామో తెలియని విచక్షణ కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్ లో ఓ యువకుడు పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. మధ్యలో దాహం వేసింది. పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని తాగాడు. కానీ తర్వాత తెలిసింది. అవి నీళ్లు కాదు .. యాసిడ్ అని.
పబ్జీ ఆట మత్తులో ..
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో యువకులు పబ్జీ గేమ్ ఆడుతున్నారు. ఆట కూడా మంచి రసపట్టులో ఉంది. ఇద్దరు, ముగ్గురు యువకుల తమ ఆటలో పూర్తిగా లీనమయ్యారు. ఎక్కువ పాయింట్లు సాధించాలనే తహ తహ ... గెలువాలనే అభిలాష ఉన్న ఓ యువకుడు పూర్తిగా పబ్జీ గేమ్ లో మునిగిపోయాడు. ఇంతలో అతడికి దాహమేసింది. కొంచెం దూరంలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకున్నాడు. వాటి పక్కన యాసిడ్ కూడా ఉంది. సాధారణంగా అయితే .. అక్కడున్న వారని ఇవేంటని అడిగి నీరు సేవించాలి. కానీ మనోడికి ఓ వైపు దాహం తీర్చుకోవాలి .. మరోవైపు తన ఆట ఏమవుతుందని టెన్షన్ తో బాటిల్ తీసుకొని తాగేశాడు. కానీ అందులో యాసిడ్ ఉందని తెలియడంతో .. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. శ్వాసకోశ నాళాలు, నోటికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇక చైనాలో అయితే ఆన్ లైన్ ఆటలకు అంతేలేకుడా పోయింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో టెన్సెంట్ ఆటను నిలిపివేసేందకు చర్యలు తీసుకుంది. దీంతోపాటు హనర్ ఆఫ్ కింగ్స్, పబ్జీ మొబైల్ ఆటలపై కూడా పలు ఆంక్షలు విధించింది. చైనాలో 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ఆన్ లైన్ గేమ్ లలో మునిగిపోతూ ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడంతో అక్కడి ప్రభుత్వం ఆన్ లైన్ ఆటలపై ఆంక్షలు విధించింది.












Click it and Unblock the Notifications