హోమ్ మంత్రి అనుచరుడు, మాజీ స్పీకర్ కు శిష్యుడు, ఆంధ్రా బార్డర్ లో నరికేసి ఎస్కేప్!
బెంగళూరు/కోలారు: మాజీ స్పీకర్ కు ఓ రాజకీయ నాయకుడు చాలా సన్నిహితుడు. ప్రస్తుతం సిట్టింగ్ హోమ్ మంత్రికి ఆయన సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పట్టపగలు సొంత పనులు చూసుకోవడానికి వెళ్లిన ఆ నాయకుడు ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో అక్కడికి వెళ్లిన కొందరు అంకుల్ బాగున్నారా ? అంటూ మాట్లాడి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ సన్నిహితుడు శ్రీనివాస్ దసరా పండుగ రోజు పట్టపగలు దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ ఛాతి, తలపై వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. శ్రీనివాస్ కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ (home minister) జి. పరమేశ్వర్ అనుచర వర్గంలో మంచి గుర్తింపు పొందారు. శ్రీనివాస్ కోలార్ జిల్లా శ్రీనివాసపూర్ తాలూకాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. కోలారు జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు. అయిన శ్రీనివాస్ ను కోలారు శివారులోని హోలగెరె రోడ్డులో నరికి చంపేశారు.

కోలార్‌లోని (kolar) హోలగెరెలోని శ్రీనివాస్ కు ఓ ఫామ్‌హౌస్ ఉంది. సోమవారం ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లిన శ్రీనివాస్ అక్కడ పనులు పరిశీలిస్తున్నాడు. ఫామ్ హౌస్ లో పనులు పరిశీలిస్తున్న సమయంలో ఆరుగురు దుండగులు అకస్మాత్తుగా అక్కడికి వెళ్లి ఆయన మీద దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్‌పై దుండగులు దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీనివాస్ ను వెంటనే కోలార్‌లోని జాలప్ప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సోమవారం శ్రీనివాస్ ఆయన ఫామ్ హౌస్ లో పనులు పరిశీలిస్తున్న సమయంలో హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ ను హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అమర్ విలేకరులతో మాట్లాడుతూ.. 'మా ప్రాంతానికి రెండు బైక్‌లపై ఆరుగురు వచ్చారని, అంకుల్ ఎలా ఉన్నారు అంటూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారని చెప్పాడు.
తరువాత శ్రీనివాస్ పై ఒక్కసారిగా దాడి చేశారని, తమ మీద దాడి చెయ్యడానికి వాళ్ల ప్రయత్నించడంతో తాము తప్పించుకున్నామని ప్రత్యక్ష సాక్షి అమర్ మీడియాకు చెప్పారు. శ్రీనివాస్ ను హత్య చేసిన నిందితులు మా ఊరిలో చాలాసార్లు తిరుగుతున్న విషయం తాను చూశానని, హంతకులను తాను గుర్తుపడుతానని అమర్ మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. హత్య జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు జిల్లా కావడం, ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) సరిహద్దుల ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో హంతకుల కోసం గాలిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications